For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ సంఘటనలే "అప్పట్లో..." కథకు స్పూర్థి : టాక్సినివారం లో దర్శకుడు సాగర్

  |

  అప్పట్లో ఒకడుండే వాడు టాలీవుడ్ 2016 ఎప్పటికీ గుర్తుండి పోయే హిట్ ఇచ్చిన సినిమా.. తొలి సినిమా తోనే టాలీవుడ్ లోకి మరో దమ్మున్న తరం ఎంటర్ అవుతోంది అంటూ వచ్చిన సంకేతాలని పక్కా చేస్తూ. హిట్ తో నిలబడ్డ దర్శకుడు సాగర్ చంద్ర అమెరికా ఉధ్యోగం, లక్షల్లో జీతం హాయిగా సాగే జీవితాన్ని వదిలేసి సినిమాల వెనక పడ్డాడు... ఒక వేళ సక్సెస్ కాకపోతే ఎమవుతుందీ??? అసలు ఉధ్యోగం వదిలేసి సినిమాలు తీస్తా అంటే ఇంట్లో ఏమన్నారు? దర్శకుడు అయ్యే వరకూ అయిన అనుభవాలేమిటీ అన్నీ ప్రశ్నలే.. అయితే ఇవన్నీ ఒక్కరికి వచ్చిన అనుమానాలు కాదు. ఇప్పుడిప్పు డే సినిమాల్లోకి అడుగు పెట్టాలనుకుంటున్న యువకులవి, ఇప్పటికే షార్ట్ ఫిల్మ్ దర్శకులుగా, అసిస్టెంట్ డైరెక్టర్లు గా కొన సాగుతున్న వ్యక్తులవి వీళ్లందరూ అడగాలనుకున్న ప్రశ్బ్నలన్నీ అడిగేసారు.

  హాయిగా నవ్వుతూ నవ్విస్తూ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాడు యువదర్శకుడు సాగర్ సాగర్ కే చంద్ర. ప్రతీ శనివారం తెలంగాణా భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రోత్సాహం తో అక్షరా కుమార్, నరేందర్ గౌడ్ నగులూరి, సంఘీర్ , సతీష్ అట్ల అనే నలుగురు యువకులతో రవీంధ్ర భారతిలో నిర్వహించబడే "సినివారం" కార్యక్రమం లో మాట్లాడటానికి వచ్చిన సాగర్ చంద్ర అక్కడికి వచ్చిన యువకులందరి తో దాదాపు రెండు గంటల పాటు చిట్ చాట్ లో పాల్గొన్నారు. అక్కడ జరిగిన చిట్ చాట్ లో అప్పట్లో ఒకడుండేవాడు తెరమీదకి రావటానికి జరిగిన ప్రయత్నాన్నీ.., మొదటి సినిమా సమయం లో ఎదుర్కున్న ఫ్రస్ట్రేషన్ నీ చెప్పుకొచ్చారు

   ఆ ఆలోచనే అప్పటికి లేదు:

  ఆ ఆలోచనే అప్పటికి లేదు:


  అనే విషయం చెప్పేముందు అప్పట్లో ఒకడుండేవాడు స్క్రిప్ట్ నుంచీ స్క్రీన్ వరకూ జర్నీ ఇలా సాగింది? ఆవిషయం చెప్పటానికి ముందు నా మొదటి సినిమా అయ్యారే గురించి చెప్పుకోవాలి... నిజానికి ఆసినిమా అనుకున్నంతగా ఆడలేదు. అనుకోని అవాంతరాలు చాలానే వచ్చాయ్. ఒక సేయింగ్ ఉంది కదా..." మనది కానిదేదీ మనది కాదు.., మంది కావాల్సింది దక్కకుండా పోదూ అని" అలాగే అయ్యింది ఆసినిమా విషయం లో. నిజానికి అసలు నిత్యానంద గారి పై సెటైర్ గా ఆ సినిమా అన్న ఆలోచనే అప్పటికి లేదు.

   రామ్ గోపాల్ వర్మ లా:

  రామ్ గోపాల్ వర్మ లా:


  కానీ సినిమా వచ్చే నాటికి ఆ ముధ్ర పడిపోయింది. అంతే కాదు అప్పుడు కొందరిచ్చిన సలహా ఏమిటంటే పబ్లిసిటీ కోణం లో కూడా చూడమని, రామ్ గోపాల్ వర్మ లా కాస్త ట్రై చేయమని. అదే దెబ్బకొట్టింది నిత్యానంద లాంటి మేకప్ తో ఉన్న పోస్టర్ చూడగానే వెళ్ళాల్సిన మెసేజ్ వెళ్ళిపోయింది. అప్పటికీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు నిత్యానంద కీ ఈ సినిమాకీ ఎలాంటి సంబందమూ లేదని చెప్పి ఉండాల్సింది. కానీ అదీ చేయలేక పోయాను. ఇప్పటికీ ఆ సినిమా నిత్యానంద స్వామి మీద సెటైర్ అనుకునే వాళ్ళు ఉన్నారు.

   ఒక కథలా అనుకోలేదు:

  ఒక కథలా అనుకోలేదు:


  కానీ అది క్లీన్ యూ సినిమా... కానీ ఆడలేదు. ఇక అక్కడితో ఆ కథ ముగిసింది. ఆతర్వాత నేను రెండు సినిమాలు చేయాల్సింది కానీ... అవీ సెట్స్ వరకూ వచ్చి ఆగిపోయాయి. అందులో ఒకటి నారా రోహిత్ గారి తో అనుకున్న సినిమా.. ఆ సమయం లోనే విష్ణు కలిసారు (అప్పట్లో ఒకడుండేవాడు లో రైల్వేరాజు) ... అసలు ముందు అప్పట్లో... ని ఒక కథలా అనుకోలేదు జస్ట్ ఒక స్క్రీన్ ప్లే ఫార్మాట్ లోనే అనుకున్నాం... పేరు కూడా ఏం అనుకోలేదు... నాకు నేనైతే సూడో రియాలిటీ అని అనుకున్నాం. దానిలో కొన్ని నేను నిజంగా చూసిన సంఘటనలనీ కలుపుకున్నాను...

   కండక్టర్ కి సపోర్ట్ చేసాడు:

  కండక్టర్ కి సపోర్ట్ చేసాడు:


  ఒకసారేమైందంటే 90లలో ఒక సారి ఆర్టీసీ బస్ ఎక్కాను అదే బస్ ఎక్కిన ఒక కానిస్టేబుల్ టికెట్ తీసుకోవటానికి ఒప్పుకోలేదు... దాంతో కండక్టర్ కీ ఈ కానిస్టేబుల్ కీ మధ్య చిన్న గొడవ జరిగింది. దాన్లో ఒక ఇంటర్మీడియట్ కుర్రాడు కండక్టర్ కి సపోర్ట్ చేసాడు. అప్పటికి ఆ కథ ముగిసినా కొన్నాళ్ళకి ఆ వూరి చుట్టు పక్కల కూంబింగ్ జరుగుతోంది అదే సమయం లో లేట్ గా ఇంటికి వస్తున్న అదే కుర్రాడు వీళ్ళకి కనిపించాడు.

   చిత్ర హింసలు పెట్టారు:

  చిత్ర హింసలు పెట్టారు:


  ఆ కూంబింగ్ బ్యాచ్ లో ఉన్న కానిస్టేబుల్ అతన్ని గుర్తు పట్టి అతన్ని పట్టుకొని ఒక వారం పాటు చిత్ర హింసలు పెట్టారు. ఆతర్వాత వదిలేసారు. అప్పుడు నాకనిపించింది రాజ్యం చేతులు చాలా బలమైనవి.. అధికారం చాలా కౄరమైనదీ అని., ఆతర్వాత నల్గొండకి షిఫ్ట్ అయ్యాక పోలీస్ క్వార్టర్స్ దగ్గరలో ఉండేవాళ్లం మా ఇంటిపక్కనే ఒక సీఐ ఉండేవాళ్ళూ. చాలా సరదాగా ఉండేవాళ్ళాయన.

   అయిదుగురు చనిపోయారు:

  అయిదుగురు చనిపోయారు:


  అక్కడ వాతావరణం కూడా కొత్తగా ఉండేది. పోలీస్ పెరేడ్స్, గన్స్, జీపులూ, ఎప్పుడైన్నా పతంగ్ కొమ్మల్లో ఇరుక్కుంటే కానిస్టేబుల్స్ చెట్టెక్కి తీసిచ్చేవాళ్ళు.. అలాంటి సమయం లో నే నిజామాబాద్ దగ్గరలో నక్సలైట్లు పెట్టిన మందుపాతర పేలి రోజూ మాతో ఉండే కానిస్టేబుల్స్ లో అయిదుగురు చనిపోయారు. ఇది మొదటి సంఘటనకి పూర్తి వ్యతిరేకం. అంటే మనం బియాండ్ గా చూసినప్పుడు ఏ సిస్టం లో అయినా దాని లోపాలు దానికుంటాయి.

   రెండు వేరు వేరు కోణాలనుంచి :

  రెండు వేరు వేరు కోణాలనుంచి :


  అసలు సిస్టం ఈస్ మేడ్ ఆఫ్ హ్యూమన్స్., ఏ వైపునుంచి చూస్తే అది కరెక్ట్ అనిపించినా రెండో వైపు నుంచి చూస్తే మాత్రం అది తప్పుగా కనిపిస్తుంది. ఇలాంటి రెండు వేరు వేరు కోణాలనుంచి ఉండే రెండు క్యారెక్టర్లు ఉండాలనుకున్నాం. ఒకటి ఉన్న సిస్టం కి వ్యతిరేకంగా కనిపించాలి..

   మరోటి సిస్టం తోనే నడుస్తున్నట్టు కనిపించాలి.

  మరోటి సిస్టం తోనే నడుస్తున్నట్టు కనిపించాలి.

  ఈ ఆలొచనలతోనే ఒక్కొక్క క్యారెక్టర్నీ డిజైన్ చేసుకుంటూ వచ్చాం. నారా రోహిత్ గారి క్యారెక్టర్ కావొచ్చు, శ్రీవిష్ణు గారి పాత్ర కావచ్చు ఒక్క రోజులో అయిపోయింది కాదు... అలా చాలా స్ట్రగుల్ తర్వాత అప్పట్లో ఒకడుండేవాడు తెరమీదకి వచ్చింది. అంటూ మరిన్ని విషయాలని షేర్ చేసుకున్నారు ఈ యువ దర్శకుడు.

  అమ్మ అరియన్ సినిమా:


  ప్రతీ శనివారం రవీంధ్ర భారతి మినీ హాల్ లో రెండు షార్ట్ ఫిలిం ల ప్రదర్శనా, ఆతర్వాత ఉత్సాహవంతులైన మూవీ మేకర్స్ కి అనుభవఙ్ఞుల తో మాట్లాడే అవకాశం ఉంటోంది ఈ వారం సాగర్ చంద్ర చెప్పిన విషయాలు అయితే ఇక ఫిబ్రవరి రెండో శనివారం ప్రముఖ జర్నలిస్ట్ కందుకూరి రమేష్ బాబు గారితో "టాక్@సినివారం" ఉంటుంది . ఇందులో కేరళ కి చెందిన జాన్ అబ్రహం క్రౌడ్ ఫండింగ్ తో చేసిన అమ్మ అరియన్ సినిమా కి సంబందించిన విషయాలతో పాటు తెలంగాణ సినిమా కి ఏ పద్ధతులు ఉపయోగమో ఒక గంట పాటు సాగే టాక్ లో వివరిస్తారు. సాగర్ చంద్ర పూర్తి ఇంటర్వ్యూ కింద ఉన్న వీడియో లో చూడవచ్చు

  English summary
  Tollywood Yound Director Sagar K Chandra chit chat with young Filim Makers at Ravindhra bharati in Sinivaram program
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X