twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎస్పీ బాలుతో భారీ స్థాయిలో ప్లాన్ రెడీ చేసుకున్న ఏఆర్.రెహమాన్.. ఆ కోరిక తీరకుండానే..

    |

    గాన గంధర్వుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం మరణించి రోజులు గడుస్తున్నా ఇంకా ఆయన కళ్ళముందే ఉన్నట్లు అనిపిస్తోందని చాలా మంది సంగీత దర్శకులు భావోద్వేగానికి లోనవుతున్నారు. అందులో ఏఆర్.రెహమాన్ ఒకరు. ఒక ఆస్కార్ విన్నర్ అయినప్పటికీ రెహమాన్ బాలు గారి వద్ద ఒక చిన్నపిల్లవాడిలానే ఉంటాడని అందరికి తెలిసిందే. SPB అంటే ఆయనకు అమితమైన భక్తి. అయితే గత కొన్ని నెలల క్రితమే రెహమాన్ బాలుతో ఒక ప్లాన్ గురించి చర్చించడం జరిగింది. చివరికి అది తీరకుండానే ఊహించని విషాదం చోటు చేసుకుంది.

    ఆ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు

    ఆ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు

    రెహమాన్ ఎక్కడ సంగీత కచేరిలు జరిపినా ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యంను తీసుకువెళ్లాలి అనే ఆలోచిస్తారు. కొన్నిసార్లు అనుకోకుండా మిస్ అవ్వడమే గాని దాదాపు వీరి కలయికలో అనేక రకాల ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే కరోనా కారణంగా ఒక ఈవెంట్ ఆగిపోయింది. ఇక దాన్ని వాయిదా వేయక తప్పలేదు. ఈ విషయాన్ని రెహమాన్ చాలాసార్లు SPB గారికి గుర్తు చేశారట.

    రెహమాన్ కోరిక నెరవేరకముందే..

    రెహమాన్ కోరిక నెరవేరకముందే..

    గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా రెహమాన్ ఈ విషయాన్ని చెప్పారు. భారీ స్థాయిలో ఎస్పీబీ గారితో కలిసి మ్యూజికల్ కన్సెర్ట్ నిర్వహించబోతున్నట్లు చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు రెహమాన్ కోరిక నెరవేరకముందే బాలు వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన టాపిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

    రోబో సినిమాలో టైటిల్ సాంగ్ కోసం

    రోబో సినిమాలో టైటిల్ సాంగ్ కోసం

    రెహమాన్ కెరీర్ లో మొదటి పాటను ఎస్బీబితోనే పాడించారు. బాలు 50ఏళ్ల సినీ కెరీర్ లో 40వేల పాటలు పాడారు. ఇక అందులో ఇళయరాజా తరువాత బెస్ట్ మెలోడీస్ రెహమాన్ సమకూర్చినవనే చెప్పాలి. ప్రయోగాత్మకమైన ట్యూన్స్ చేయాలి అంటే రెహమాన్ మనసులో గుర్తొచ్చేది మొదట బాలుగారే. రోబో సినిమాలో టైటిల్ సాంగ్ కోసం ముందుగా మరొక సింగర్ ని అనుకున్నప్పటికి చివరికి బాలుతోనే పాడించారు.

    Recommended Video

    Amaram Akhilam Prema Director Jonathan Edwards About Movie : Part 03
    వారిద్దరు కలిసిన ప్రతి సారి..

    వారిద్దరు కలిసిన ప్రతి సారి..

    రెహమాన్, ఎస్పీబీ కలిసిన ప్రతి సారి ఎదో ఒక అద్భుతమైన పాట రాబోతోందని ఈజిగా అర్థం చెసుకోవచ్చు. అలాంటి ఈ కాంబినేషన్ లో ఇక పాటలు రావనే విషయం నిజంగా సంగీత ప్రియుల మనసులను కలచి వేస్తున్నాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రెహమాన్ కూడా ఒక స్పెషల్ వీడియో ద్వారా ఆయనకు నివాళులర్పించారు.

    English summary
    Raghu Kunche And ravi Varma Claims That SPB Sings Last Song For Their Movies. The Row Between Raghu Kunche And ravi Varma Goes On For Song That SPB SIngs Last.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X