For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శంకర్-రాంచరణ్ ప్రాజెక్ట్ గురించే చెప్పాడా?.. నెటిజన్ ప్రశ్నకు ఏఆర్ రెహ్మాన్ రిప్లై వైరల్

    |

    ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో పాన్ ఇండియన్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. దక్షిణాది నుంచి ఎక్కువ చిత్రాలు ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు అందరి దృష్టి శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ మీద పడింది. దిల్ రాజు తన బ్యానర్‌లో రాబోతోన్న ఈ 50వ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఈ సినిమాను నేషనల్ లెవెల్‌లో ప్లాన్ చేశాడు.

    క్రేజీ కాంబో..

    క్రేజీ కాంబో..

    రామ్ చరణ్ శంకర్ కాంబోకు ఎన్నో విశిష్టతలున్నాయి. శంకర్ ఇంత వరకు కూడా నేరుగా తెలుగు చిత్రాన్ని చేయలేదు. మొదటిసారిగా తెలుగులో చేస్తున్నాడు. అది కూడా ఎప్పుడూ ఓ తెలుగు హీరోతో సినిమాను చేయలేదు. ఇలా మొదటిసారిగా ఓ తెలుగు హీరోతో సినిమా చేయబోతోన్నాడు.

    దిల్ రాజు బ్యానర్..

    దిల్ రాజు బ్యానర్..

    ఇక దిల్ రాజు తన బ్యానర్‌లో నిర్మించే ప్రతీ సినిమాను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాడు. అలా ఇప్పుడు తన కెరీర్‌లో మైల్ స్టోన్ అయిన 50వ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన ప్రకటనే నేషనల్ వైడ్‌గా ప్రకంపనలు సృష్టించింది.

    మ్యూజిక్ డైరెక్టర్ గురించి..

    మ్యూజిక్ డైరెక్టర్ గురించి..

    అయితే రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో.. మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా చర్చలు జరిగాయి. కొందరు అనిరుధ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇంకొందరు మాత్రం శంకర్ అంటే కచ్చితంగా రెహమాన్ అయి ఉంటాడని చెప్పకొచ్చారు. కానీ అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు.

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    అయితే ఓ విషయంపై ఏఆర్ రెహమాన్ స్పందించాడు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే రెహమాన్ తాజాగా ఓ నెటిజన్ ప్రశ్నకు రిప్లై ఇచ్చాడు. ఉమెన్స్ డే విషెస్ చెబుతూ ఏ ఆర్ రెహమాన్ చేసిన ట్వీట్‌కు ఓ నెటిజన్ వింత ప్రశ్న విసిరాడు. దానికి సమాధానంగా ఏఆర్ రెహమాన్ వేసిన ట్వీట్‌తో తెలుగు ప్రేక్షకులు పండుగ చేసుకుంటున్నారు.

    త్వరలోనే అంటూ..

    త్వరలోనే అంటూ..

    తెలుగులో నేరుగా ఆల్బమ్ ఎప్పుడు చేస్తారు.. అని ఓ నెటిజన్ అడిగేశారు. దానికి స్పందించిన ఏఆర్ రెహమాన్ అతి త్వరలోనే అంటూ సమాధానం ఇచ్చేశాడు. అంటే అది శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ అయి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మొత్తానికి రెహమాన్ బీట్‌కు చెర్రీ స్టెప్పులేస్తే ఇక రచ్చ రచ్చే.

    English summary
    AR Rahman ABout Shankar Ram charan Project To Netizen Question..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X