సచిన్‌ను, సల్మాన్‌ను అధిగమించిన ఏఆర్ రెహ్మాన్
మీకు ఇప్పటికే అర్థమయి ఉంటుంది ఇదంతా దేని గురించో..! అవునండీ మీరు ఊహించింది నిజమే. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ కమ్యూనిటీ 'ఫేస్ బుక్'లో ఏఆర్ రెహ్మాన్ రెహ్మాన్ తన అధికారిక పేజీకి కోటికి పైగా లైక్‌లతో టాప్ పొజిషన్ దక్కించుకున్నారు. ఇప్పటి వరకు రెహ్మాన్ ఫేస్ బుక్ పేజీని 1,01,38,509 మంది అభిమానులు లైక్ చేసారు. తన పేజీని లైక్ చేసిన వారి సంఖ్య 10 మిలియన్లకు చేరగానే రెహ్మాన్ తనను అభిమానిస్తున్న అందరికీ థాంక్స్ చెబుతూ పోస్ట్ చేసారు.
ఇక రెహ్మాన్ తర్వాతి స్థానంలో 91,09,898 లైక్‌లతో ఇండియన్ లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉండగా, ఆ తర్వాత స్థానంలో దబాంగ్ స్టార్ సల్మాన్ 75,34,958 లైకులు సాధించి మూడో స్థానం దక్కించుకున్నారు. ఇక మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ 63,67,036 లైక్ లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ మధ్యనే ఫేస్ బుక్ లో అకౌంట్ తెరిచిన అమితాబ్ బచ్చన్ పేజీకి 36,00,477 మంది అభిమానులు ఉన్నారు.
ఇక హీరోయిన్ల విషయానికొస్తే....35,52,699 అభిమానులతో టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. ఓవరాల్ గా చూసుకుంటే ఆమెది ఆరో స్థానం. ఇక హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, గాన కోకిల లతా మంగేష్కర్ వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు.


Click it and Unblock the Notifications












