AR Rahman divorce: 29 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకున్న ఆస్కార్ విజేత.. విడాకులకు కారణమదేనా?
AR Rahman divorced: ఇండస్ట్రీలో మరో ఓ సెలబ్రిటీ తన వివాహ బంధానికి స్వస్తి పలికాడు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ తన వివాహ జీవితానికి ముగింపు పలికారు. తన 29 ఏండ్ల మార్యేజ్ లైఫ్ కు ఎండ్ కార్డు వేస్తూ..ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా బాను కు విడాకులు ఇచ్చారు. ఈ విషయాన్ని దంపతుల తరఫున వారి లాయర్ వందనా అధికారికంగా ప్రకటించారు.
ఈ సమయంలో వారి లాయర్ వందన షా మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల వివాహ బంధాన్ని ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఏఆర్ రెహమాన్, సైరా భాను విడాకులు తీసుకున్నారు. వారి బంధంలో భావోద్వేకపూరిత ఒత్తిడి నెలకొంది. అందుకే వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వారికి ఒకరిపై ఒక మరొకరికి ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందుల కారణంగా వారు దూరం అవుతున్నారని లాయర్ వందనా షా పేర్కొన్నారు.

విడాకులపై ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. మా వివాహ బంధం త్వరలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని ఆనందించాను. కానీ, అనుకోకుండా వివాహ బంధానికి ఇలా ముగింపు పలకాల్సి వచ్చింది. విరిగిన హృదయాలు దేవుని కూడా ప్రభావితం చేస్తాయి. పలికిన ముక్కలు మళ్ళీ అతుక్కోలేవు. అందుకే మా దారులు వేరు అని తెలుసుకొని.. విడిపోతున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో స్నేహితులు మమ్మల్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం అంటూ ఎక్స్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు
“We had hoped to reach the grand thirty, but all things, it seems, carry an unseen end. Even the throne of God might tremble at the weight of broken hearts. Yet, in this shattering, we seek meaning, though the pieces may not find their place again. To our friends, thank you for…
— A.R.Rahman (@arrahman) November 19, 2024
కాగా..ఏఆర్ రెహమాన్ 1995లో సైరా బాను పెళ్లి చేసుకున్నారు.వీరి వివాహ బంధానికి 29ఏళ్లు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ఖతీజా, రహీమా, అమీన్. పెద్ద కుమార్తె ఖతీజాకు రియాజుద్దీన్ షేక్ మహమ్మద్‌తో మే 2022లో వివాహం జరిగింది ఈ రిసెప్షన్‌లో మనీషా కొయిరాలాతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











