కేరళ బాధితుల కోసం రూ. 1 కోటి విరాళం ప్రకటించిన ఏఆర్ రెహమాన్

By Bojja Kumar

ఇండియన్ మ్యూజిక్ సంచలనం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కేరళ వరద బాధితుల కోసం రూ. 1 కోటి విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రెహమాన్ తన టీంతో కలిసి యూఎస్ఏలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సాయాన్ని ప్రకటించారు. మేము చేసేది చిన్న సహాయమే అయినా కేరళలోని మన బ్రదర్స్, సిస్టర్స్‌కు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

యూఎస్ఏలోని వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ రెహమాన్ అండ్ టీమ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వాషింగ్టన్‌లో తన ప్రదర్శన సందర్భంగా రెహమాన్ ఈ విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా కేరళ ప్రజలను ఉద్దేశించి... 'కేరళ, కేరళ, డోన్ట్‌ వర్రీ కేరళ' అంటూ పాట పాడారు.

AR Rahman donated one crore to Kerala relief fund

సెప్టెంబర్ 5న రెహమాన్ తన పర్యటన ముగించుకుని ఇండియా తిరిగి వస్తారని తెలుస్తోంది. వచ్చిన తర్వాత ఆయన మణిరత్నం మూవీ 'చిక్క చివంత వనమ్'(తెలుగులో 'నవాబ్') మూవీ ప్రమోషన్లలో బిజీగా కాబోతున్నారు. ఈ మూవీ ఆడియో వేడుకలో రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారని టాక్.

కేరళ వరదల్లో దాదాపు 483 మంది మరణించారు. వేలాది మంది ఇళ్లను కోల్పోయారు. కేరళ పరిస్థితి చూసి చలించిపోయిన ఇతర ప్రాంతాల ప్రజలు, సినీ సెలబ్రిటీలు భారీగా సహాయం అందించారు. పలువురు స్టార్స్ భారీ ఎత్తున విరాళాలు అందించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X