వేదికపై ఏఆర్ రెహమాన్ కూతురు అలా.. ట్రోలింగ్ చేస్తున్న వారికి బుద్ది చెప్పింది!
ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఎప్పుడూ ఎలాంటి వివాదాల్లో చిక్కుకోడు. తాను పనిచేసే చిత్రాలు బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడమే అతడి పని. ఆస్కార్ విజేతగా నిలిచిన ప్రతిభ రెహమాన్ సొంతం. తాజాగా తన ప్రమేయం లేకుండానే ఏఆర్ రెహమాన్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. రెహమాన్ ఆస్కార్ గెలిచిన చిత్రం స్లమ్ డాగ్ మిలియనీర్ విడుదలై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెహమాన్ కుమార్తె ఖతీజా కూడా హాజరైంది.

భావోద్వేగంతో
ఖతీజా భావోద్వేగంతో మాట్లాడుతూ తన తండ్రి సాధించిన విజయాల్ని గుర్తుచేసుకుంది. ఖతీజా ప్రసంగానికి అక్కడున్న వారి నుంచి మంచి స్పందన వచ్చింది. ఖతీజా మాట్లాడుతున్న సమయంలో రెహమాన్ కూడా పక్కనే ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఖతీజా బుర్ఖా ధరించి రావడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ విషయంలో రెహమాన్ ని దూషిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

రెహమాన్ అలాంటివాడు
ఏఆర్ రెహమాన్ సంకుచిత భావాలు కలవాడని దీని ద్వారా అర్థం అవుతోంది. రెహమాన్ తన కుమార్తె పై ఒత్తిడి తేవడం వలనే ఆమె బుర్ఖా ధరించి వచ్చింది అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దీనిపై ఖతీజా సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. నా తండ్రితో కలసి వేదిక పంచుకున్నా. దీనిని కూడా వివాదం చేస్తారని అనుకోలేదు. మీరు అనుకుంటున్నట్లు తాను బుర్ఖా ధరించడంలో ఎవరి బలవంతం లేదని నా ఇష్టప్రకారమే బుర్ఖా ధరించి వచ్చానని ఖతీజా తెలిపింది.

నిజాలు తెలుసుకోండి
నా వ్యక్తిగత స్వేచ్చని నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. అనవసరంగా ఇలాంటి విమర్శలు చేయకండి. బుర్ఖా ధరించడం నేను గౌరవంగానే భావిస్తాను. విమర్శించే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి అంటూ ఖతీజా పేర్కొంది. ఖతీజా వ్యాఖ్యలకు చాలా మంది సెలెబ్రిటీలు, నెటిజన్లు మద్దత్తు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











