ప్రభాస్ పక్కన ఉన్నది ఎవరో తెలుసా? ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా సెట్స్‌లో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఆశ్చర్య పడాల్సింది ఏముంది అనుకుంటున్నారా? ఆ ఫోటోలో కేవలం ప్రభాస్ మాత్రమే ఉంటే ఆశ్చర్యం లేదు కానీ... ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖుడు ఒకరు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రభాస్ పక్కన ఉన్నది మరెవరో కాదు... ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్. ఇటీవల రెహహాన్ 'సాహో' మూవీ సెట్స్‌లో ప్రభాస్‌ను కలిశారు. బాహుబలి స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

అభిమానుల్లో కొత్త అనుమానాలు
అయితే ప్రభాస్, రెహమాన్ కలిసి కనిపించడంతో అభిమానుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇద్దరూ కలిసి ఏదైనా సినిమాకు పని చేయబోతున్నారా? లేక క్యాజువల్‌గా రెహమాన్ వచ్చి కలిశారా? అనేది చర్చ మొదలైంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

ఇద్దరూ కలిస్తే క్రేజ్ మరింత పెరుగుతుంది
బాహుబలి సినిమాతో ప్రభాస్ నేషనల్ రేంజి స్టార్ అయ్యాడు. ఏఆర్ రెహమాన్‌కు ఆల్రెడీ పెద్ద మ్యూజిక్ స్టార్. ఇద్దరూ కలిసి ఏదైనా సినిమాకు కలిసి పని చేస్తే క్రేజ్ మరింత పెరగడం ఖాయం. తాజాగా ఫోటో చూసిన తర్వాత భవిష్యత్తులో ఇద్దరి కాంబినేషణ్లో సినిమా వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రభాస్ బిజీ బిజీ
ప్రభాస్ రెండు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒక పక్క సుజిత్ దర్శకత్వంలో ‘సాహో' చేస్తూనే ‘జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమ కథా చిత్రాన్ని మొదలు పెట్టేశారు. దీనికి ‘అమూర్' అనే పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

రెహమాన్
ఈ ఏడాది రెహమాన్ దాదాపు 10 చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. అందులో రజనీకాంత్ నటించిన 2.0 మూవీతో పాటు పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











