Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కావాలనే చిరంజీవికి హ్యాండిచ్చాడా?: సైరా చేయనని అక్కడ మాత్రం ఒప్పుకున్నాడు
Recommended Video
"సైరా.. నరసింహారెడ్డి" టీంకు పెద్ద షాకే ఇచ్చాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు రెహమాన్ అంటూ కొన్ని నెలల కిందట ఘనంగా ప్రకటించింది చిత్ర బృందం. కానీ ఇటీవలే తాను ఈ సినిమా చేయట్లేదంటూ చావు కబురు చల్లగా చెప్పాడు రెహమాన్.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అన్ని సినిమా ఇండియాలోని అన్ని సినిమా ఇండస్ట్రీల నుండి ఆర్టిస్ట్‌లను తీసుకుంటున్నారు.
చిరంజీవి సరసన నయనతార
చిరంజీవి 151వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ చేస్తున్నాడని వచ్చిన వార్తలపై తాజాగా ఏ.ఆర్. రెహమాన్ స్పందించారు.
ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్
ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్‌తో ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ గుర్తింపుని పొందుతుందని చిత్ర యూనిట్ ఎంతో ఆశపడింది. అయితే తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న మ్యూజిక్ కన్సర్ట్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన రెహమాన్ ఈ చిత్రంపై వివరణ ఇచ్చారు. "ఈ సినిమాకి సంగీతం అందించే అవకాశం వచ్చింది కానీ, చేయలేకపోతున్నాను.
నా అభిమాన హీరో
మెగాస్టార్ చిరంజీవిగారు నా అభిమాన హీరో. ఆయన సినిమాకి సంగీతం అందించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది కానీ, బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమాని చేయలేకపోతున్నాను. ఈ విషయం చెప్పడానికి చాలా బాధపడుతున్నాను'' అంటూ ఏ. ఆర్. రెహమాన్ ఈ చిత్రం గురించి తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన రెహమాన్ ఈ సినిమాకు పని చేసి ఉంటే దానికి వచ్చే విలువే వేరుగా ఉండేది. ఐతే డేట్లు సర్దుబాటు చేయలేకపోవడం వల్ల ‘సైరా' చేయలేకపోయానని అన్నాడు రెహమాన్. మరి ఓవైపు మణిరత్నం సినిమాకు.. మరోవైపు వేరే భాషల చిత్రాలకూ డేట్లు ఇస్తూ.. ‘సైరా'కు ఎందుకు నో చెప్పాడన్నదే అర్థం కావడం లేదు.
మలయాళ సినిమాకు కూడా ఓకే
తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసమే ‘సైరా'లో చేయలేకపోతున్నట్లుగా సంకేతాలిచ్చిన రెహమాన్.. వేరే ప్రాజెక్టుల్ని మాత్రం వదులుకోవట్లేదు. తాజాగా ఆయన ఓ మలయాళ సినిమాకు కూడా ఓకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.
ఆడుజీవితం
పృథ్వీరాజ్ హీరోగా తెరకెక్కనున్న "ఆడుజీవితం" అనే సినిమాకు రెహమాన్ పని చేయనున్నాడట. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారట. మలయాళంలో గొప్ప నవలగా పేరు తెచ్చుకున్న ‘ఆడుజీవితం'కు ఇది సినిమాటిక్ అడాప్షన్. ఇంతకుముందు ఎప్పుడో పాతికేళ్ల కిందట ‘యోధ' అనే మలయాళ సినిమాకు పని చేశాడు రెహమాన్.
మెగాస్టార్ సినిమానే కాదన్న రెహమాన్
మళ్లీ ఇన్నాళ్లకు మలయాళంలో ఆయన సినిమా చేయనున్నాడట. మరి మెగాస్టార్ సినిమానే కాదన్న రెహమాన్.. పృథ్వీ రాజ్ లాంటి మామూలు హీరో సినిమాకు ఈ గ్యాప్‌లో ఎలా ఒప్పుకున్నాడో? ఇదంతా చూస్తుంటే డేట్లు ఖాళీ లేకే ‘సైరా' నుంచి రెహమాన్ తప్పుకున్నాడా అన్నది డౌట్‌గానే ఉంది.