ఆస్కార్ రావాలంటే..రహ్మాన్

By Staff

AR Rahman
హాలీవుడ్‌ సినిమా నిపుణులకు ఆస్కార్‌పై ఉన్న తృష్ణ మనలో లేదు. అలాగని మనలో సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మక శక్తికి ఎలాంటి ఢోకా లేదు. అంటూ మన దేశం సినిమాలుకు ఇంతకాలం ఆస్కార్ రాకపోవడానికి మనలో కారణం..దానిపై సరైన ఆసక్తి, ప్రేరణ, ప్రణాళిక లేకపోవడమే కారణమని సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ తెలిపారు. ఆస్కారు అవార్డులు పొందిన తరువాత తొలిసారిగా చెన్నై వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

అలాగే అయితే ఈ అవార్డుపై నాలో కేవలం 5 శాతం మాత్రమే నమ్మకం ఉండేది. భవిష్యత్తులో మరికొందరు భారతీయులు ఆస్కార్లు సాధించాలని ఆశిస్తున్నా. ఆస్కారు అవార్డులు వచ్చినంత మాత్రనా నేను భారతీయ సినిమాలకు దూరమైనట్లు కాదు. మంచి సినిమా ఏదైనా సరే భాషతో సంబంధం లేకుండా సంగీతం అందిస్తా. హాలీవుడ్‌కే పరిమితమవుతానని అనుకోవద్దు.

ప్రస్తుతం మూడు ఆంగ్ల చిత్రాలకు సంగీతం సమకూర్చే విషయమై చర్చలు జరుగుతున్నాయి. నేను సంగీతం సమకూర్చిన అన్ని పాటలు నాకు నచ్చుతాయి. తమిళంలోని తిరుక్కురల్‌కు సంగీతం సమకూర్చే పని త్వరలోనే పూర్తి చేస్తాను. భక్తి సంగీతం ఏదైనా సరే నేను ఇష్టపడుతా. స్లమ్‌డాగ్‌ మిలీనియర్‌ సినిమాకు ఒప్పుకోవడానికి కారణం ఆ సినిమా దర్శకుడు కథ చెప్పిన విధానమే. ఇక రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X