నెట్ లో ఎ.ఆర్.రహమాన్ ఆన్‌లైన్ వ్యాపారం
ఇక నుంచి ఎ.ఆర్.రహమాన్ సంగీతం కోసం షాపులకు తిరగక్కర్లేదు. ఆయన ఆన్ లైన్ లో ఓ షాపు తెరిచారు.తన అధికారిక వెబ్‌సైట్ http://www.arrahman.com లోనే ఈ ఆన్‌లైన్ స్టోర్ తెరిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల సౌకర్యార్థం ఈ షాపు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఆస్కార్ పురస్కారాలు తెచ్చిపెట్టిన 'స్లమ్‌డాగ్ మిలియనీర్'తో పాటు ఆయన సంగీతం అందించిన వివిధ సినిమాలు, ఆల్బమ్‌లలోని పాటలను కొనుక్కోవచ్చు. సైట్లో లో ప్రస్తుతం కొన్ని రకాల సంగీత ఉత్పత్తులే అందుబాటులో ఉన్నాయి. మున్ముందు డీవీడీలుసహా మరిన్ని ఉత్పత్తులు కొనుగోలుకు అందుబాటులోకి వస్తాయి. కెనడా డాలర్లు, యూరోలు, బ్రిటన్ పౌండ్లు, అమెరికా డాలర్లు మాత్రమే చెల్లించేందుకు వీలుంది. మొత్తానికి ఆయన అభిమానులకు ఆయన మరింత అందుబాటులో ఉండబోతున్నారన్నమాట. ఇక రహమాన్ ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ పులి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











