twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏఆర్ రెహమాన్ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్... పేదరికం నుండి ఆస్కార్ వరకు!

    By Bojja Kumar
    |

    Recommended Video

    ఏఆర్ రెహమాన్ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్..

    ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా తన జర్నీ మొదలు పెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన సొంత గడ్డ తమిళనాడులో భారీ సంగీత విభావరి నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చెన్నైలోని వైఎంసీఏ గ్రౌండ్స్‌లో జనవరి 12, 2018వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ విభావరి జరుగనుంది.

    తమిళనాడు ప్రజలకు అంకితం ఇస్తూ ఈ సంగీత ప్రదర్శన జరుగనుంది. గత 25 ఏళ్లు నమ్మశక్యం కాని విధంగా గడిచాయి. ఇది ఓ అందమైన ప్రయాణం, ఇంతమంది అభిమానులను పొందడం గొప్పగా ఉంది. తమిళనాడు ప్రజలు నాకు ఎప్పుడూ ప్రత్యేకమే, 25 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా వారికోసం ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు రహమాన్ తెలిపారు.

     రెహమాన్ ప్రస్థానం

    రెహమాన్ ప్రస్థానం

    రెహ్మాన్‌ అసలు పేరు ఎ. ఎస్‌. దిలీప్‌ కుమార్‌. తండ్రి ఆర్. కె. శేఖర్, తల్లి కస్తూరి. శేఖర్ సంగీత దర్శకుడు. ఆలయాల్లో భజన పాటలు పాడేవాడు. రెహమాన్ కు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు. నాలుగేళ్ళ వయసు నుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్న రెహమాన్.... తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రిని కోల్పోయాడు.

     సంగీత పరికరాలను అద్దెకిస్తూ, 11 ఏళ్ల ప్రాయంలోనే

    సంగీత పరికరాలను అద్దెకిస్తూ, 11 ఏళ్ల ప్రాయంలోనే

    తండ్రి మరణంతో రెహమాన్ కుటుంబం మరింత పేదరికంలోకి వెళ్లింది. ఇంట్లోని సంగీత పరికరాల్ని అద్దెకిస్తూ రెహమాన్ కుటుంబం జీవనం సాగించేది. రాను రాను ఆ ఆదాయం కూడా తగ్గడంతో 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తినేసుకున్నాడు రెహమాన్.

     సంగీత దర్శకుల దగ్గర పని చేస్తూ

    సంగీత దర్శకుల దగ్గర పని చేస్తూ

    గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లే చేయడం రెహమాన్‌కు బాగా వచ్చు. 11 ఏళ్ల వయసులోనే ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్‌లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు.

     తల్లి నగలు అమ్మి సొంత స్టూడియో

    తల్లి నగలు అమ్మి సొంత స్టూడియో

    తల్లి నగలు అమ్మి ఆధునిక హంగులతో ఇంట్లోనే ఒక స్టూడియో ప్రారంభించాడు. సినిమాల్లోకి రాక ముందు బాపు సహకారంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అక్షరమాల ప్రాజెక్టుకు సంగీతం సమకూర్చాడు. తెలుగులో రెహమాన్ మొదటి ప్రాజెక్టు అదే. బాపు కుమారుడు వేణుగోపాల్ వ్యక్తిగతంగా రెహమాన్ కు మంచి స్నేహితుడు. తర్వాత కొన్ని వాణిజ్య ప్రకటనలకు పని చేశారు.

     తొలి సినిమా అవకాశం

    తొలి సినిమా అవకాశం

    సంతోష్-శివన్ దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకునిగా నటించిన ‘యోధ' అనే మలయాళ సినిమాతో రెహమాన్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మణిరత్నం ‘రోజా' సినిమాకు రెహమాన్ అందంచిన సంగీత సూపర్ హిట్ కావడంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని బాషల్లో రెహమాన్ బిజీ అయిపోయాడు.

     ఆస్కార్ అవార్డ్

    ఆస్కార్ అవార్డ్

    "స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రంలో 'జై హో' అనే పాటకుగాను ప్రతిష్ఠాత్మకమైన "గోల్డెన్ గ్లోబ్ అవార్డు"(ఆస్కార్)ను రెమహాన్ సొంతం చేసుకున్నాడు. ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడు కూడా రెహమానే కావడం విశేషం.

     రెహమాన్ ప్రత్యేకత అదే

    రెహమాన్ ప్రత్యేకత అదే

    కర్నాటక సంగీతాన్ని, ఖవ్వాలీ సంప్రద్రాయాన్ని, రెగే, హిప్-హాప్, ర్యాప్, రాక్, పాప్, జాజ్, ఒపెరా, సూఫీ ఆఫ్రికన్, అరేబియన్, పాశ్చాత్య సంగీతాన్ని ఇలా అన్నింటినీ మిక్స్ చేసి తదనైన ఒరిజినల్ బాణీలను తయారుచేయడం రెహమాన్ ప్రత్యేకత.

     రెహమాన్ అవార్డులు రివార్డులు

    రెహమాన్ అవార్డులు రివార్డులు

    టైమ్ మ్యాగజైన్ రెహ్మాన్‌ కు మొజార్ట్ ఆఫ్ మద్రాస్ బిరుదు ఇచ్చింది. రెండు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకొని భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత రెహ్మాన్‌కే దక్కుతుంది. జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా హిందీ, తమిళ చిత్రాలకు 19 సార్లు ఫిలిమ్‌ఫేర్‌ అవార్డులను, తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నాడు.

     అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులలో

    అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులలో

    2009 లో ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులలో ఒకడిగా రెహమాన్ గుర్తింపు పొందారు. రెహమాన్ గౌరవార్ధం కెనడా లోని ఒంటారియో రాష్ట్రంలోని ఒక వీధికి అతని పేరు పెట్టారు.

     2017లో భారీగా సంపాదన

    2017లో భారీగా సంపాదన

    2017 సంవత్సంలో ఇండియాలో అత్యధికంగా సంపాదన కలిగిన సెలబ్రిటీలలో ఒకడిగా రెహమాన్ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

    English summary
    Music maestro A R Rahman is all set to pay his respects to his homeland, Tamil Nadu, in a concert marking his 25-year-long musical journey. The AR Rahman concert will be held at Y M C A grounds, Nandanam, Chennai on January 12, 6 pm onwards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X