దుబాయ్‌లో ఏఆర్‌ రెహ్మాన్‌ కచేరి

By Srikanya

హైదరాబాద్ : ఆస్కార్‌ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. ఆయన అక్కడ కచేరీ నిర్వహించే పనుల్లో నిమగ్నమైనట్లు తెలిసింది. దర్శకుడు శంకర్‌ ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఐ'కి ఇటీవలే స్వరాలు అందించిన ఆయన... వెంటనే దుబాయ్‌ వెళ్లిపోయారు. సామాజిక మాధ్యమంలో ఆయనే స్వయంగా ఈ విషయం తెలిపారు.

'హలో దుబాయ్‌... నేను అక్కడికి వస్తున్నాను. మీరంతా నా కార్యక్రమాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా' అంటూ ట్వీట్‌ చేశారు. మణిరత్నం తెరకెక్కిస్తున్న 'ఒకే కన్మణి' చిత్రానికి కూడా రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నిత్యామీనన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనిపై పరిశ్రమలో బాగానే అంచనాలున్నాయి.

ఇక ఎ.ఆర్‌.రెహ్మాన్‌ కుమారుడు అమీన్‌(12) గొంతు త్వరలో మనం విననున్నాం. ఆ కుర్రాడు ఓ తమిళ చిత్రానికి గళం విప్పనున్నాడు. ఇప్పటికే ఓ హిందీ చిత్రంలో పాట పాడిన అమీన్‌ను తమిళంలోనూ తమ చిత్రాలకు పాట పాడించాలని గతంలో కొందరు దర్శకులు ఎ.ఆర్‌.రెహ్మాన్‌ను కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు.

AR Rahman puts Dubai into a trance

ఇదిలా ఉండగా ఇదే విషయాన్ని దర్శకుడు మణిరత్నం కోరడంతో ఓకే చేశారట. 1992లో మణిరత్నం దర్శకత్వంలోని రోజా' చిత్రం ద్వారానే సంగీత దర్శకుడిగా ఎ.ఆర్‌.రెహ్మాన్‌ పరిచయమయ్యారు. ఆ చిత్రంలోని పాటలు సూపర్‌ హిట్‌ కావడంతో పాటు మరికొన్ని హిట్లతో కోలివుడ్‌ అగ్ర సంగీత దర్శకుల జాబితాలో రెహ్మాన్‌ చేరారు.

తర్వాత బాలివుడ్‌, హాలివుడ్‌ చిత్రాలకు సంగీతం సమకూర్చి ఆస్కార్‌ అవార్డు పొందారు. ఈ సెంటిమెంట్‌తోనే మణిరత్నం దర్శకత్వంలోని చిత్రంలో అమీన్‌ను పాడించడానికి రెహ్మాన్‌ సుముఖత చూపినట్లు సమాచారం.

ఇక మణిరత్నం చేయబోయే చిత్రం ఓ ప్రేమ కథ అని తెలుస్తోంది. ఆ మధ్యన నాగార్జున, మహేష్ కాంబినేషన్ లో ఓ చారిత్రిక చిత్రం ఫ్లాన్ చేసిన ఆయన దాన్ని ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. ఈ నేపధ్యంలో ఆయన తనదైన శైలిలో ఓ ప్రేమ కథను చిత్రీకరించి ఆకట్టుకోవాలనుకుంటున్నారు. ఆయన చివరి చిత్రం కడలి. భాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X