twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెహమాన్ వెళ్ళిపోయాడా..!? మంచిదే: సైరాపై అభిమానుల స్పందన.., కారణాలివే

    |

    మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగ‌ణ‌మే న‌టిస్తోంది. అలాగే టాప్ టెక్నీషియ‌న్స్ కూడా ప‌నిచేస్తున్నారు. వారిలో డ‌బుల్ ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌. రెహ‌మాన్ ఒక‌రు. అయితే..

    Recommended Video

    AR Rahman Withdraw From Chiru 'Sye Raa' Movie చిరు కి హ్యాండ్ ఇచ్చిన రెహమాన్..
    చిరుతో ప‌నిచేయాల‌ని

    చిరుతో ప‌నిచేయాల‌ని

    రెహ‌మాన్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్లు ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. చిత్ర బృందం దీని గురించి ఎక్క‌డా ప్ర‌స్తావించ‌క‌పోవ‌డంతో.. అది ఒట్టి గాసిప్పే అనుకున్నారు. అయితే.. స్వ‌యంగా రెహ‌మాన్‌నే తాజాగా ఆ విష‌యాన్ని ఒప్పుకోవ‌డంతో.. ఆ విష‌యం టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యింది.

    బిజీ షెడ్యూల్స్ వ‌ల్ల

    బిజీ షెడ్యూల్స్ వ‌ల్ల

    'సైరా' స‌బ్జెక్ట్ బాగుంద‌ని.. చిరుతో ప‌నిచేయాల‌ని చాలా రోజులుగా అనుకుంటున్నాన‌ని.. అయితే బిజీ షెడ్యూల్స్ వ‌ల్ల ఈ సినిమాకి చేసే అవ‌కాశాన్ని మిస్ అయ్యాయ‌ని చెప్పుకొచ్చారు రెహ‌మాన్‌. దీంతో.. ఈ విష‌యంలో క్లారిటీ వ‌చ్చిన‌ట్ల‌య్యింది.

    రెహమాన్ మ్యూజిక్

    రెహమాన్ మ్యూజిక్

    రెహమాన్ మ్యూజిక్ తో స్ట్రయిట్ గా తెలుగు పాట వినే అవకాశం కోల్పోయామని కొందరు సినీ అభిమానులు బాధపడ్డా.. మెగా అభిమానులు మాత్రం ఈ విషయంలో హ్యాపీగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రెహమాన్ మ్యూజిక్ అంటేనే ఓ సంచనలం అన్నట్టుండేది.

    ఆ మ్యాజిక్ మిస్సయింది

    ఆ మ్యాజిక్ మిస్సయింది

    ఒక్కో పాట శ్రోతలను ఊపేసేది. కానీ ఈమధ్య అతడి మ్యూజిక్ లో ఆ మ్యాజిక్ మిస్సయింది. టోటల్ ఆల్బమ్ లో ఒకటి రెండు పాటలు కూడా జనాలకు ఎక్కడం లేదు. లేటెస్ట్ గా వచ్చిన చెలియాలో అయితే ఒక్క పాట కూడా జనాలకు కనెక్ట్ కాలేదు. తాజాగా రెహమాన్ రజనీకాంత్ - శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న 2.0 సినిమాకు సంగీతం అందించాడు.

     రెహమాన్ సంగీతం

    రెహమాన్ సంగీతం

    ఈ పాటలు విన్నవారు కూడా పెదవి విరిచేస్తున్నారు. అంతే కాదు ఇప్పటివరకూ రెహమాన్ సంగీతం అందించిన స్ట్రైట్ తెలుగు సినిమా ఏదీ హిట్ అయిన చరిత్ర లేదు... అయితే డబ్బింగ్ సినిమా లేదా తమిళ రీమేక్ సినిమాలే... ఆ సెంటిమెంట్ ని బట్టి చూసుకున్నా ఒక గండం తప్పినట్టే అనుకోవాలి.

    టైం లేనందువల్లే

    టైం లేనందువల్లే

    సైరా సినిమా చేయడానికి తన దగ్గర టైం లేనందువల్లే చేయలేకపోతున్నానని రెహమాన్ మాట దాటవేశాడు. కానీ ప్రస్తుతం మళయాళంలో పృథ్వీరాజ్ హీరోగా నటిస్తున్న మీడియం బడ్జెట్ మూవీ ఆడు జీవితంకు సంగీతం అందిస్తున్నాడు. కాబట్టి సైరా నుంచి తప్పుకోవడానికి ఇతర కారణాలేవో ఉండి ఉంటాయని అందరూ అనుకుంటున్నదే. ఏ కారణంతో రెహమాన్ తప్పుకున్నా మెగా అభిమానులు మాత్రం ఈ పరిణామం పట్ల హ్యాపీగానే కనిపిస్తున్నారు.

    English summary
    AR Rahman has said in reports that the delay in Sye Raa Narasimha Reddy taking off had forced him to quit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X