ఎఆర్ రహమాన్‌కు మరో పురస్కారం
ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ ను మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. సంగీత ప్రపంచంలో పేరెన్నికగన్న 'లండన్ ట్రినిటీ కాలేజీ ఆఫ్ మ్యూజిక్' గౌరవ వేతనం ప్రకటించారు. యూకేలోని గ్రీన్‌విచ్‌లో ఈ నెల 16న జరిగిన కార్యక్రమంలో రెహమాన్ ఈ వేతనాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారిక వెబ్‌సైట్ వెల్లడించింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంగీత కళాశాలల్లో ట్రినిటీ కాలేజీ కి చాలా గొప్ప పేరు. ఈ సందర్భంగా రెహమాన్..తాను మనిషి ఆధ్యాత్మిక మార్గంలో పయనించేందుకు సంగీతమే సరైన సాధనంగా భావిస్తారని ఆయన వెబ్ సైట్ పేర్కొంది. ఇక రహమాన్ తెలుగులో తాజాగా పవన్ కళ్యాణ్ పులి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తమిళంలో గౌతం మీనన్ దర్శకత్వంలో శింబు,త్రిష కాంబినేషన్ లో రూపొందిన చిత్రానికి పనిచేస్తున్నారు.
More from Filmibeat
ఎఆర్ రహమాన్ స్లమ్ డాగ్ మిలియనీర్ త్రిష శింబు పవన్ కళ్యాణ్ పులి లండన్ ట్రినిటీ కాలేజీ ఆఫ్ మ్యూజిక్ యూకే గ్రీన్విచ్ ar rahman simbu trisha pawan kalyan puli fellowship


Click it and Unblock the Notifications











