AR Rahman Divorce: 28 ఏళ్ల అసిస్టెంట్‌తో రెహమాన్ ఎఫైర్? విడాకులపై సైరాబాను లాయర్ క్లారిటీ..

AR Rahman Divorce: సినీ సెలబ్రెటీలు నిత్యం ఏదొక విషయంలో వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా బానుతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విడాకుల వార్త యావత్ సిని ప్రపంచాన్ని కుదిపేసింది. రెహమాన్ - సైరా విడాకుల ప్రకటన రోజునే.. ఏఆర్ రెహమాన్ అసిస్టెంట్ మోహిని కూడా తన భర్తకు విడాకులిచ్చేసింది. దీంతో లేని లేని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలపై సైరా బాను లాయర్ కీలక ప్రకటన చేశారు. ఇంతకీ ఆ ప్రకటన ఏంటీ?

AR రెహమాన్ - సైరా బానులు విడాకుల ప్రకటనతో సినీ ప్రపంచం షాక్ అయింది. వాళ్లిద్దరూ తమ వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నామని తెలియజేస్తూ.. తమ వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరారు. అయితే.. రెహమాన్ - సైరా విడాకులు ప్రకటించిన రోజునే.. ఆయన బాసిస్ట్ మోహిని కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు తెలిపింది. దీంతో సోషల్ మీడియాలో పలు వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసమే రెహమాన్ తమ 29 ఏళ్ల వివాహ బంధానికి విడాకులతో స్వస్తి పలికారన్న వార్తలు గుప్పుమన్నాయి. నెట్టింట్లో లేనిపోని కథనాలు వైరల్ గా మారాయి.

AR Rahman Saira Banu s lawyer clarity on online rumours linking their separation to the composer s bassist Mohini Dey

ఎవరికి నచ్చినట్టు వారు రూమర్స్ క్రియేట్ చేశారు. రహమాన్ దంపతులు విడిపోవడానికి కారణం అసిస్టెంట్ తో అఫైర్ ఉందనే ప్రచారం కూడా జరిగింది. ఒకే సమయంలో రెహమాన్ అతని శిష్యురాలు విడాకులు తీసుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వీటన్నిటిపై రెహమాన్ భార్య తరపు లాయర్ వందన షా స్పందించారు. సోషల్ మీడియాలో వెలుబడుతున్న కథనాలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

లాయర్ వందన షా మీడియాతో మాట్లాడుతూ.. రెహమాన్ దంపతులు విడిపోవడానికి.. అతని అసిస్టెంట్ మోహిని విడాకులు తీసుకోవడానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. రహమాన్ సైరా బానులు పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారని, వారి వ్యక్తిగత కారణాల వల్లనే వారి వివాహ బంధానికి స్వస్తి పలికారని తెలిపారు. రెహమాన్ దంపతులు విడాకులు తీసుకోవడం ఎంతో బాధ కలిగించే విషయమని, ఈ విషయాన్ని ఎవరు ఇష్టపడరని, అలాగే సెలబ్రేట్ చేసుకునే విషయం కాదని పేర్కొన్నారు.

AR Rahman Saira Banu s lawyer clarity on online rumours linking their separation to the composer s bassist Mohini Dey

లాయర్ వందన షా ఇంకా మాట్లాడుతూ.. రెహమాన్ దంపతులు.. వారి వివాహ బంధంలో ఎన్నో ఎత్తు పొలాలను చూశారని, వారిద్దరూ వీడిపోవడానికి కారణాలు వేరే ఉన్నాయని, వారి వ్యక్తిగత స్వేచ్ఛ మేరకు ఆ వివరాలను తాను వెల్లడించడం లేదంటూ పేర్కొన్నారు. వారు కలిసి ఉన్న లేకపోయినా ఉన్నతమైన జీవితాన్ని కొనసాగించాలని వారిద్దరూ భావిస్తున్నారని లాయర్ వందన షా పేర్కొన్నారు. ఇదెలా ఉంటే.. ఏఆర్ రెహమాన్- సైరా బానులు 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. అందులో ఒకరికి పెళ్లి కూడా అయింది. వారు తమ 29 ఏండ్ల వివాహ బంధాన్ని తెంచుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

విడాకుల ప్రకటనపై ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ.. మా వివాహ బంధం త్వరలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని సంతోషించాను. కానీ, అనుకోని కారణాలవల్ల వివాహ జీవితానికి ముగింపు పలకాల్సి వచ్చింది. ఇలాంటి కఠిన పరిస్థితులలో తనకు స్నేహితులు అండగా నిలుస్తారని, తన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతారని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సమయంలో రెహమాన్ పిల్లలు కూడా స్పందించారు. ఈ క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని పేర్కొన్నారు.

More from Filmibeat

Read more about: ar rahman saira banu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X