రచయితగా ఏఆర్ రెహమాన్ న్యూ అవతార్
హైదరాబాద్: ఏఆర్ రెహమాన్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సంగీత ప్రపంచమే. ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని కీర్తి సంపాదించుకున్న భారతీయ సంగీత దర్శకుల్లో ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టించాడు.
ఇప్పటి వరకు సంగీత ప్రపంచంలో మునిగి తేలిన ఏఆర్ రెహమాన్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. స్క్రిప్టు రైటర్‌గా తన టాలెంట్ ప్రదర్శించబోతున్నారు. ఈ విషయం స్వయంగా ఏఆర్ రెహమాన్ వెల్లడించడం గమనార్హం. ముంబైలో జరిగిన హిందీ వెర్షన్ ‘ఐ' ఆడియో వేడుకలో రెహమాన్ ఈ విషయం వెల్లడించారు.

తన రాసిన స్క్రిప్టు అందించిన సినిమాలో ఆయన నిర్మాతగా నటించబోతున్నారు కూడా. త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. 2014 సంవత్సరం తనకు ఎంతో ప్రత్యేకమైన సంవత్సరమని, ఈ సంవత్సరం మొత్తం 14 చిత్రాలకు సంగీతం అందించాను. అందులో మూడు హాలీవుడ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ‘ఐ' సినిమాకు పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో విక్రమ్ ఇంట్రడక్షన్ సాంగ్ కంపోజ్ చేయడానికి వారం సమయం పట్టింది అన్నారు.
ఇక ‘ఐ' సినిమా తెలుగు వెర్షన్ ఆడియో విడుదల విషయానికొస్తే...ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఆడియో వేడుక జరుగనుంది. దర్శకుడిగా ఇంత వరకూ ప్రేక్షకులు మెచ్చిన ఎన్నో సూపర్ హిట్స్ అందించిన ప్రముఖ దర్శకుడు శంకర్ ఇపుడు చియాన్ విక్రమ్ హీరోగా హాలీవుడ్ చిత్రాల స్థాయికి ధీటుగా ‘ఐ' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ ఫిలింస్ అధినేత వి.రవిచంద్రన్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ విజువల్ వండర్‌ను మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ప్రైలిమిటెడ్ సంస్థ వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చియాన్ విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా నటించిన ఈచిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.


Click it and Unblock the Notifications











