స్టార్ స్క్రీన్ ప్లే రచయిత సచిన్ భౌమిక్ మృతి
ప్రముఖ స్క్రీన్ ప్లే రచయిత సచిన్ భౌమిక్శ్(81)ఈ రోజు గుండెపోటుతో మరణించారు.ఆరాధన,గోల్ మాల్,ఏన్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్ వంటి ఎన్నో చిత్రాలకు అద్బుతమైన కథ,కధనాలు అందించి జీవం పోసిన ఆయన మృతి బాలీవుడ్ కి తీరని లోటు.ముఖ్యంగా ఆరాధన,ఆనంద్ చిత్రాలకు ఆయన రాసిన డైలాగులను ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేరు.ఆయన 1958 లో లాజ్ వంతి చిత్రంతో కెరీర్ ప్రారంభించి దాదాపు తొంభై చిత్రాలు పూర్తి చేసారు.ఆయన చివరి చిత్రం 2008 లో వచ్చిన యువరాజ్.సల్మాన్ ఖాన్,కత్రినా కైఫ్,అనీల్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని సుభాష్ ఘయ్ డైరక్ట్ చేసారు.ఆయన సుభాష్ ఘయ్ కి ఆస్దాన రచయితగా ఉన్నారు. కర్జ్,సౌదాఘర్,పరదేశ్,తాళ్, కిస్నా చిత్రాలకు పనిచేసారు.
అలాగే రాకేష్ రోషన్ తో కలిసి కరన్ అర్జున్, కోయల,కోయి మిల్ గయా,క్రిష్ చిత్రాలకు స్క్రీన్ ప్లేకు వర్క్ చేసారు. హృషికేష్ ముఖర్జీతో చేసిన ఆరాధన (1961)తో ఆయనకు మొదటసారిగా గుర్తింపు లభించింది.ఇక ఆయన్ని మాస్టర్ ఆఫ్ ఎడాప్టర్ గా అభివర్ణిస్తూంటారు.ఆయన గురించి చెబుతూ..ఆయన విపరీతంగా పుస్తకాలు చదువతూండేవారు.అలాగే ఎన్నో సినిమాలు చూస్తూండేవారు.వాటిని తను రాసే స్క్ర్రీన్ ప్లేలలో అద్భుతంగా ఎడాప్ట్ చేసేవారు.ఆయన్ని ఒక సిట్యువేషన్ చెప్పి సీన్ కావాలి అని అడిగితే చాలా వరసగా చెప్తూనే ఉండేవారు. రకరకాల ఆల్టర్నేటివ్స్ ఆయన వద్ద ఉండేవి.ఆయనది గొప్ప జ్ఞాపకశక్తి.
ఇక ఆయన రాజు-రాణి టైటిల్ తో ఓ చిత్రం కూడా డైరక్ట్ చేసారు.రాజేష్ కన్నా,షర్మిలా ఠాగూర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది.ఆ తర్వాత ఆయన మెగాఫోన్ పట్టుకోలేదు.జీవితాంతం స్క్రిప్టులు రాస్తూనే ఉన్నారు.ఈ రచనా మేధావికి ధట్స్ తెలుగు నివాళులు అర్పిస్తోంది.


Click it and Unblock the Notifications











