అరణ్య హిట్టు కోసం మరో ప్రయోగం.. ఆ సీన్స్ లేపేసి..

రానా దగ్గుబాటి నటించిన పాన్ ఇండియా మూవీ అరణ్య గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది. కానీ రిలీజ్ అనంతరం కలెక్షన్స్ అనుకున్నంతగా రాలేవు. ఓ వర్గం నుంచి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా క్రిటిక్స్ నుంచి రివ్యూలు కూడా బాగానే వచ్చాయి.

సినిమాకు పెద్దగా నెగిటివ్ టాక్ అయితే రాలేదు. కానీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా క్లిక్కవ్వలేదు. దాదాపు 60కోట్లతో నిర్మించిన ఈ సినిమాను సౌత్ లోనే కాకుండా హిందీలో కూడా రిలీజ్ చేశారు. కానీ సినిమా ఇప్పటివరకు 10కోట్ల షేర్ కూడా తీసుకురాలేకపోయింది. అయితే సినిమా నిడివి కాస్త ఎక్కువయ్యిందనే టాక్ కూడా రావడంతో చిత్ర యూనిట్ రన్ టైమ్ ను తగ్గించినట్లు తెలుస్తోంది.

Aranya movie edited and deleted 30 minutes scenes

మొత్తంగా 2గంటల 44నిమిషాలు ఉన్న ఈ సినిమాను ఇంకాస్త ఎడిట్ చేసి 2గంటల 6నిమిషాలకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు అరంగంటకు పైగా సీన్స్ ను లేపేశారట. అయితే ఈ ఏడిటింగ్ వర్క్ ఇంకాస్త ముందే చేసి ఉంటే సినిమాకు చాలా ప్లస్ అయ్యేది. ఇక ఈ వారం మరో రెండు సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. నాగార్జున వైల్డ్ డాగ్ తో పాటు కార్తీ సుల్తాన్ సినిమాలు రాబోతున్నాయి. మరి వాటి ప్రభావం అరణ్య సినిమాపై ఎలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X