‘ఋషి‌’గా మారిన ఇట్స్ మై లవ్ స్టోరీ హీరో

By Bojja Kumar

'ఇట్స్ మై లవ్ స్టోరీ' సినిమా ద్వారా ఇటీవల హీరోగా పరిచయం అయిన అరవింద్ త్వరలో 'ఋషి' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో అరవింద్ మెడికో పాత్రలో నటించబోతున్నాడు. అరవింద్ సరసన సుప్రియా హీరోయిన్ నటిస్తోంది.

దాసరి నారాయణరావు యంగ్ ఇండియా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన అరవింద్...ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమా ద్వారా మంచి పేరును సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా ఓ మోస్తరు విజయం సాధించడం, అరవింద్ పర్సనాలిటీ, నటన ఆకట్టుకునే విధంగా ఉండటంతో మరిన్ని అవకాశాలు ఆయన ఖాతాలో వచ్చి చేరుతున్నాయి.

ఎ మెడికో జర్నీ అనే ట్యాగ్ లైన్‌తో ఒక మెడికల్ విద్యార్థి ప్రేమకథను ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నారు. రాజ్ మాదిరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్నిగ్ధ సంగీతం సమకూర్చుతున్నారు. ఇప్పటికే షూటింగ్, ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రమేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేష్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మన దేశం, మిలన్, ఖిలోనా, ఎక్ తుజే కె లియా అనే చిత్రాలు రూపొందాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X