అసెంబ్లీలో... త్రివిక్రమ్ మూవీ ‘అరవింద సమేత’ డైలాగ్ పేల్చిన రోజా!
Recommended Video
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటి, ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలోని డైలాగ్ జగన్‌కు ఆపాదించి చెప్పడం హైలెట్ అయింది.
'ప్రతి ముప్పై సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపార వేత్తలు ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు. కాని ప్రతి జనరేషన్‌లోనూ ఆ కొత్త థాట్‌ని ముందుకు తీసుకువెళ్లే వాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాన్నే టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూశావా? బాలిరెడ్డీ.. వాడే ఆ టార్చ్ బేరర్'' అనే డైలాగ్ జగన్‌కు అనుకూలంగా మార్చి పేల్చారు రోజా.
అరవింద సమేతలోని డైలాగ్ ఇదే..
‘అరవింద సమేత' చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి రావు రమేష్ చెప్పే ఈ డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఇపుడు ఇదే డైలాగును రోజా తెలివిగా జగన్‌కు అనుకూలంగా మార్చారు. రోజా చెప్పిన ఈ డైలాగుకు మంచి స్పందన వస్తోంది.
జగన్‌పై త్రివిక్రమ్ డైలాగ్ పేల్చిన రోజా
‘ప్రతి ముప్పై సంవత్సరాలకి బ్రతుకు ఆలోచన మారుతుందంటారు. దాన్ని సినిమా లాంగ్వేజ్‌లో ట్రెండ్ అంటారు... రాజకీయ నాయకులు తరం అంటారు.. మామూలు జనం జనరేషన్ అంటారు. కాని ప్రతి జనరేషన్‌కి ఆ కొత్త థాట్‌ని ముందుకు తీసుకళ్లేది ఒక్కరే ఉంటారు. ఆయన్నే టార్చ్ బేరర్ అంటారు. గవర్నర్ ప్రసంగం చూశాక ఈ నవ్యాంధ్రను నవ శకం వైపు నడిపించే టార్చ్ బేరర్ దొరికాడని మేమంతా సంతోషించా అధ్యక్షా...చిమ్మ చీకటిలో చిన్నాభిన్నమైన ఐదు కోట్ల మంది ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఆయన సంస్కరణలు, సంక్షేమ పథకాలతోనే అర్థమైంది. రాబోయే 30 సంవత్సరాలు మా టార్చ బేరర్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో ఈ రాష్ట్ర గతి మారుతుందనే నమ్మకం ఉంది' అంటూ రోజా వ్యాఖ్యానించారు.

వైరల్ అవుతున్న రోజా వీడియో
సోషల్ మీడియాలో రోజా వీడియో వైరల్ అవుతోంది. సినిమా డైలాగును ఏపీ సీఎంకు అద్భుతంగా అన్వయించారంటూ అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో జగన్, రోజా వ్యతిరేకులు ఈ వీడియోను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

జబర్దస్త్ కంటిన్యూ చేస్తున్న రోజా
గతంలో ఎమ్మెల్యేగా కొనసాగుతూనే జబర్దస్త్ షోకు జడ్జిగా చేసిన రోజా... తాజాగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ అధికారంలోకి వచ్చినా తర్వాత ఏపీఐఐసి చైర్మన్‌గా పదవి దక్కించుకున్నారు. ఆ పదవి చేపడుతూనే ఆమె జబర్దస్త్ షోలో కొనసాగుతున్నారు.


Click it and Unblock the Notifications











