twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అరవింద సమేత ప్రీ రిలీజ్ రివ్యూ: త్రివిక్రమ్ ప్రతిభకు.. ఎన్టీఆర్ స్టామినా అగ్ని పరీక్ష

    |

    అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం అరవింద సమేత.. వీర రాఘవ. యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజాహెగ్డే జంటగా నిర్మాత చినబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్‌తో మరోసారి ఎన్టీఆర్‌ను వీర రాఘవగా సరికొత్తగా త్రివిక్రమ్ చూపించబోతున్నారు. మహిళా సాధికారిత ప్రధానాంశంగా ఈ సినిమాను తెరకెక్కింది. ఈ సినిమా ప్రత్యేకతలు మీ కోసం..

     రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా

    రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా

    పదికిపైగా రిలేషన్ తర్వా ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రం అరవింద సమేత. ఎన్నో సంవత్సరాలుగా మంచి కథ కోసం వేచి చూసిన వీరు చివరకు అరవింద సమేత కోసం జట్టు కట్టారు. రాయలసీమ నేపథ్యంతో కక్షలు, కారుణ్యాలు, వైషమ్యాల కథతో ఈ చిత్రం రూపొందింది.

     స్పెషల్‌గా జగపతిబాబు రోల్

    స్పెషల్‌గా జగపతిబాబు రోల్

    జగపతి బాబు పాత్ర ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కరడుగట్టిన ఫ్యాక్షన్ నేతగా ఆయన ఉగ్రరూపం చూపించినట్టు వార్తలు బయటకు వచ్చాయి. జగపతి బాబు పోషించిన పాత్రను ప్రేక్షకులు అసహ్యించుకొనే స్థాయిలో ఉంటుందనే స్వయంగా త్రివిక్రమ్ చెప్పడంతో ఆయన నటన ప్రత్యేక ఆకర్షణగా మారింది.

    ఎన్టీఆర్ కోరిక మేరకు

    ఎన్టీఆర్ కోరిక మేరకు

    ఎన్టీఆర్‌కు మంచి విషయాలను చెప్పే నానమ్మ పాత్రలో బాలీవుడ్ నటి సుప్రియా పాథక్ నటించింది. ఎన్టీఆర్ కోరిక మేరకు ఈ పాత్రను సుప్రియాతో చేయించారు. ఈ పాత్ర కోసం ముందే స్క్రిప్టు తెప్పించుకొని డైలాగ్స్ కంఠస్థం చేసింది.

     ఎన్టీఆర్‌తో తొలిసారి పూజా హెగ్డే

    ఎన్టీఆర్‌తో తొలిసారి పూజా హెగ్డే

    వరుస విజయాలతో దూసుకెళ్తున్న పూజా హెగ్డే తొలిసారి ఎన్టీఆర్‌తో జత కట్టింది. పూజా హెగ్డే చుట్టే కథ తిరుగడం స్పెషల్ ఎట్రాక్షన్. ఎన్టీఆర్, పూజా కాంబినేషన్ సీన్లు అదరగొట్టేలా ఉంటాయనేది టాక్. అందుకే ఈ సినిమాకు అరవింద సమేత.. వీర రాఘవ అని టైటిల్ పెట్టారు.

     ఇషా రెబ్బా, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో

    ఇషా రెబ్బా, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో

    ఇప్పటి వరకు చిన్న చితక పాత్రలు వేస్తున్న హీరోయిన్ ఇషా రెబ్బా, హీరో నవీన్ చంద్రకు ఈ చిత్రంలో మంచి పాత్రలు లభించాయి. స్వయంగా నవీన్ చంద్ర పాత్ర గురించి బ్రహ్మండంగా చెప్పడంతో ఆ పాత్రపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డేకు ఇషా రెబ్బా చెల్లెలుగా నటిస్తున్నది.

     ఎన్టీఆర్‌కు పితృ వియోగంతో

    ఎన్టీఆర్‌కు పితృ వియోగంతో

    అరవింద సమేత చిత్ర షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌కు పితృవియోగం జరిగింది. టీడీపీ నేత, నటుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో దసరాకు అరవింద సమేత రిలీజ్ అవుతుందా అనే ప్రశ్న తలెత్తింది. అయితే తండ్రి మరణం తర్వాత నాలుగో రోజే సినిమా షూటింగ్‌లో పాల్గొని ఈ సినిమా దసరాకు రిలీజ్ అయ్యే విధంగా ఎన్టీఆర్ తోడ్పాటునందించారు.

    పెంచల్ దాస్ రాయలసీమ యాస, భాష

    రాయసీమలోని ఉపాధ్యాయుడైన పెంచల్‌దాస్ ఈ సినిమాకు డైలాగ్స్‌కు యాసను, భాషను అద్దారు. రుధిరం అనే పాటను రాయడమే కాకుండా.. పెనిమిటి పాటను కూడా ఆలపించాడు. సినిమాలో పెనిమిటి పాట అత్యంత కీలకంగా మారింది. ఈ పాటను ఎన్టీఆర్‌పై చిత్రీకరించడం గమనార్హం. ఈ పాట ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేస్తుందనేది ఇన్‌సైడ్ టాక్.

     మహిళా సాధికారిత‌తో కథకు

    మహిళా సాధికారిత‌తో కథకు

    మహిళా సాధికారిత అనే పాయింట్ చుట్టు అరవింద సమేత కథను అల్లారు. ఈ ఫ్యాక్షన్‌లో ఓ మహిళకు స్థానం కల్పిస్తే ఏమి జరుగుతుంది అనేది కథలో కీలకపాయింట్. అది ఎన్టీఆర్‌కు కూడా బాగా నచ్చింది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. యుద్ధం చేసేవాడికే శాంతి గురించే మాట్లాడే అర్హత ఉంటుంది అనే పాయింట్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.

    English summary
    NTR, Trivikram Srinivas's Aravinda sametha has sky high expections. This movie teaser, First Look got good response from fans. Now Aravinda Sametha juke box came out into the market. Four songs have good lyrical values. This movie set to release on October 11th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X