అరవింద సమేత ప్రీ రిలీజ్ : అతి పెద్ద విషాదం నుండి తొందరగా కోలుకున్నాడు: ఎన్టీఆర్ గురించి త్రివిక్రమ్

యంగట్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ వస్తున్న అరవింద సమేత.. వీర రాఘవ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్‌కు సిద్దమైంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత చినబాబు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, నటీనటులు సితార, శుభలేఖ సుధాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకకు యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరించారు.

ఈ వేడుకలో భాగంగా ప్రఖ్యాత డ్రమ్మర్ శివమణి ప్రత్యేకంగా వచ్చారు. తనదైన శైలిలో తన సంగీత బృందంతో ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు.

తారక్‌ను చూశాక మగాడంటే వీడేరా బుజ్జి అనిపించింది: జగపతి బాబు

తారక్‌ను చూశాక మగాడంటే వీడేరా బుజ్జి అనిపించింది: జగపతి బాబు

తారక్‌తో నేను ఫస్ట్ షాట్ చేసినపుడు ఫైట్‌తో మొదలైంది. ఆ సిక్స్ ప్యాక్, బాడీ చూసి మగాడంటే వీడేరా బుజ్జి అనిపించాడు. ఒక సందర్భంలో త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాశాడు... ఆ పొద్దు వాన్ని చూసినపుడు చావు చొక్కా లేకుండా తిరగాడినట్లు ఉంది బాల్ రెడ్డి అని.... ఈ డైలాగ్ టూమ్ అంటూ జగపతి బాబు వ్యాఖ్యానించారు. త్రివిక్రమ్‌తో పని చేయాలని ఎప్పటినుండో ఉంది. నేను ఈ సినిమాలో ఉండాలనేది తారక్ ఐడియా. తారక్ చెబితే త్రివిక్రమ్ నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అది పక్కన పెడితే... త్రివిక్రమ్ ఈ సినిమాను కసితో, ఉడుకుతున్న రక్తంతో తీశాడు. ప్రతి ఆర్టిస్టును ఎలా ఛాలెంజింగా చూపించాడంటే ... ప్రతి ఒక్కరినీ అద్భుతంగా చూపించాడు... అని జగపతి బాబు చెప్పుకొచ్చారు.

Recommended Video

NTR Speech @Aravindha Sametha Pre Release Event
దసరాకు ఫ్యాన్స్‌కు పండుగే

దసరాకు ఫ్యాన్స్‌కు పండుగే

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుందోననే ఎదురు చూసిన వారిలో నేను ఒకరిని. పాటలు రిలీజ్ అయినప్పుడు ఏదో అనుకొన్నాను. కానీ వింటూ వింటుండగా.. పాయిజన్‌లా ఎక్కాయి. దసరాకు రిలీజ్ అయ్యే ఈ సినిమా ఫ్యాన్స్‌కు పండుగగా మారడం ఖాయం. టెంపర్ తర్వాత రూటు మార్చి ఎన్టీఆర్ బాటలోనే యంగ టైగర్ ప్రయాణిస్తున్నాడు అని దిల్ రాజ్ అన్నారు.

సునీల్

సునీల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత' మూవీ ఆడియో వేడుక హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ తన ఫ్రెండ్, చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ గురించి ఎమోషనల్‌‌గా రియాక్ట్ అయ్యారు. అనంతరం ఎన్టీఆర్ గురించి చెబుతూ... అతడి గొప్ప మనసు గురించి వెల్లడించారు.

చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. మన జీవితంలో అమ్మా నాన్న మనల్ని ఓపికగా పెంచి ఇది మంచి చెడు అని చెబుతారు. తర్వాత గురువులు కొంత విజ్ఞానం నేర్పుతారు. తర్వాత అన్నయ్యలు, మనకంటే పెద్దోళ్లు డబ్బులు ఇచ్చి మనల్ని బాగా చూస్తారు. నేను హైదరాద్ వచ్చిన తర్వాత ఆ మూడు పోర్షన్లు తీసుకున్న వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. నాకు డబ్బులు ఇచ్చి, విజ్ఞానం ఇచ్చి నాకు రూట్ చూపించాడు. జీవితంలో మంచి ఫ్రెండును సెలక్ట్ చేసుకుంటే చాలు లైఫ్ ధైర్యంగా ఉంటుంది అనడానికి ఎగ్జాంపుల్ త్రివిక్రమ్.... అని సునీల్ చెప్పుకొచ్చారు.

నా మాట వినాల్సిందే.. సిరివెన్నెల ఝలక్

నా మాట వినాల్సిందే.. సిరివెన్నెల ఝలక్

అరవింద సమేత చిత్రంలో సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రెండు పాటలు రాశారు. ఈ పాటలు రిలీజై ఇప్పటికే ట్రెండింగ్‌గా మారాయి. ఈ వేడుకలో సిరివెన్నెల మాట్లాడుతుండగా అభిమానులు అడ్డుపడ్డారు. దాంతో ఎన్టీఆర్ మాటలు వినాలంటే.. మా మాటలు కూడా వినాల్సిందే అని అన్నారు. ఎన్టీఆర్ అభిమానులంటే కిర్రెక్కించే పాటలే కాదు.. హృదయంతో వినే పాటలను కూడా ఆదరిస్తారు అని అన్నారు. నా చేత ఓ పాటను రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నిర్మాత, దర్శకుడు అలాంటి పాటను రాయించడానికి కూడా భయపడుతారు. కానీ త్రివిక్రమ్, చినబాబు పాటను రాయించారు. రుధిరం అనే పాటను పెంచల్ దాస్ రాసి స్వయంగా పాడారు. నేను రాసిన పాటలకు రాయలసీమ భాషను అద్ది.. నేను, రామజోగయ్యశాస్త్రి, పెంచలదాసు అందించాం అని అన్నారు.

అతి పెద్ద విషాదం నుండి తొందరగా కోలుకున్నాడు: ఎన్టీఆర్ గురించి త్రివిక్రమ్

అతి పెద్ద విషాదం నుండి తొందరగా కోలుకున్నాడు: ఎన్టీఆర్ గురించి త్రివిక్రమ్

అరవింద సమేత ఆడియో వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ... కొన్ని సందర్భాల్లో మాట్లాడటం కంటే మాట్లాడకుండా ఉండటం చాలా అందంగా ఉంటుంది. ఈ రోజు నాకు అలాంటి సందర్భం. ఈ సినిమాలో పని చేసిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సమయంలో జరిగిన అతి పెద్ద విషాదం నుండి అతి తొందరగా కోలుకుని, జీవితంలో కూడా నిజమైన హీరోగా ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్‌కు మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు.

ఎన్టీఆర్

ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత' మూవ ఆడియో వేడుక హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అట్టహాసంగా మొదలైంది. వేడుక ప్రారంభమైన కొంతసేపు తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ వేదిక వద్దకు ఎంట్రీ ఇవ్వగానే అభిమానులు జై ఎన్టీఆర్ అంటూ గట్టిగా అరుస్తూ స్వాగతం పలికారు.

ఆడియో వేడుక వేదిక వద్దకు వచ్చే ముందు ఎన్టీఆర్ చాలా గంభీరంగా కనిపించారు. అన్నయ్య కళ్యాణ్ రామ్ చేయి పట్టుకుని బాధను దిగమింగుకుని వస్తున్నట్లు అతడి ముఖం కనిపించింది. ఇటీవలే తన తండ్రి హరికృష్ణను కోల్పోయిన ఎన్టీఆర్... ఆ బాధ నుండి ఇంకా బయటకు రాలేదని స్పష్టమవుతోంది.

ఎన్టీఆర్‌ కోసం కాంప్రమైజ్ కాను

ఎన్టీఆర్‌ కోసం కాంప్రమైజ్ కాను

అన్నయ్య ఎన్టీఆర్ అంటే చాలా ప్రేమ. అన్నయ్య సినిమా అంటే కాంప్రమైజ్ కాను. నిద్రలో కూడా అలర్ట్‌గా ఉంటాను. నేను మ్యూజిక్ చేయలేదు. కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలకు విలువ ఇచ్చాను. సిరివెన్నెల, రామజోగయ్యశాస్త్రి, పెంచల్‌దాస్ అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. అందుకే ఇంత బాగా మ్యూజిక్ వచ్చింది.

కల్యాణ్ రాం

కల్యాణ్ రాం

అరవింద సమేత చిత్రంలో సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రెండు పాటలు రాశారు. ఈ పాటలు రిలీజై ఇప్పటికే ట్రెండింగ్‌గా మారాయి. ఈ వేడుకలో రుధిరం పాట అందరిలో ఉద్వేగాన్ని నింపింది. ఏ కొమ్మలో కూలిందో.. అంటూ వేదికపై గాయకులు నిఖిత, పెంచలదాస్ పాడుతుండగా కల్యాణ్ రాం, ఎన్టీఆర్ ఉద్వేగానికి గురయ్యారు. జీవిత సత్యాన్ని తెలిపే పాట వింటూ ఓ దశలో ఎన్టీఆర్ కంటతడి పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X