ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కంటతడి.. నాన్న, పెదనాన్న చనిపోయినా.. వృత్తిధర్మం పాటించామని..

అరవింద ట్రైలర్‌ను హీరో కల్యాణ్ రాం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అద్భుతమైన దర్శకుడు, నటుడు కలిస్తే ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ మచ్చు తునక. ఈ కాంబినేషన్ గురించి మేము పదేళ్ల నుంచి ఎదురుచూశాం. ఈ రోజు ఇలా సాధ్యామైంది అని చెప్పారు. ఈ సందర్బంగా కల్యాణ్ రాం ఎమోషనల్‌గా మాట్లాడారు.

ఎన్టీఆర్ వృత్తిధర్మానికి సూచిక

ఎన్టీఆర్ వృత్తిధర్మానికి సూచిక

1962లో పొద్దున్నే మా తాత గారు, అన్నగారు నందమూరి తారక రామారావు షూటింగ్‌కు వెళ్లారు. ఆయన పెద్ద కుమారుడు, మా పెదనాన్న రామకృష్ణ చనిపోయారు. ఆ విషయం తెలిసినా మా తాత గారు షూటింగ్ పూర్తి చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్లారు. అది ఆయన పాటించిన వృత్తిధర్మానికి సూచిక.

Recommended Video

NTR Speech @Aravindha Sametha Pre Release Event
మా తాత షూటింగ్‌కు వెళ్లగా

మా తాత షూటింగ్‌కు వెళ్లగా

1976లో మా తాత ఎన్టీఆర్ షూటింగ్ వెళ్లిన సమయంలో మా ముత్తాత మరణించారు. అయినా షూటింగ్ పూర్తి చేసుకొని ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. నిర్మాత నష్టపోకూడదు అనే విషయాన్ని పాటించి వృత్తి ధర్మాన్ని పాటించారు.

బాలయ్య బాబాయ్ పెళ్లికి

బాలయ్య బాబాయ్ పెళ్లికి

1992లో మా బాలయ్య బాబాయ్, రామకృష్ణ పెళ్లిళ్లు జరిగాయి. మా తాత ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ప్రజాసేవను వృత్తిధర్మంగా భావించారు కాబట్టి ఆయన వారి పెళ్లిళ్లకు హాజరు కాలేదు. మా తాత, మా తండ్రి వృత్తిధర్మాన్ని పాటించడంలో ఎవరికీ సాటిరారు అని కల్యాణ్ రామ్ అన్నారు.

నాన్న హరికృష్ణ మరణించిన తర్వాత

నాన్న హరికృష్ణ మరణించిన తర్వాత

2018 ఆగస్టు 29న మా ఇంటిలో మరో విషాదం చోటుచేసుకొన్నది. మా నాన్న హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే ఆ సమయంలో అరవింద సమేత రిలీజ్ అవుతుందో లేదో అని అందరూ అనుకొన్నారు. కానీ 30 రోజుల షూట్‌ని రాత్రింబవళ్లు కష్టపడి మా అన్నయ్య ఎన్టీఆర్ షూటింగ్ పూర్తి చేశారు. ఈ రోజు ప్రీ రిలీజ్‌కు హాజరయ్యాం. అది మా అన్నయ్య ఎన్టీఆర్ పాటించిన వృత్తిధర్మం అని కల్యాణ్ రామ్ ఉద్వేగానికి గురయ్యారు.

కంటతడి పెట్టిన కల్యాణ్ రామ్, ఎన్టీఆర్

కంటతడి పెట్టిన కల్యాణ్ రామ్, ఎన్టీఆర్

చివర్లో ఏ కోనలో కూలినాడో.. ఏ కొమ్మలో చేరినాడో.. ఏ వాడలో చేరినాడో అంటూ ఏడుస్తూ కల్యాణ్ రామ్ పాడటం అందరినీ ఉద్వేగానికి గురిచేసింది. వేదికపైన ఉబికి వస్తున్న కన్నీళ్లను ఎన్టీఆర్ ఆపుకొంటూ కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X