అరవింద సమేత ప్రీ రిలీజ్ లైవ్: ఎన్టీఆర్ మాట వినాలంటే.. మా మాట వినాల్సిందే.. సిరివెన్నెల
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ వస్తున్న అరవింద సమేత.. వీర రాఘవ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్‌కు సిద్దమైంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత చినబాబు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, నటీనటులు సితార, శుభలేఖ సుధాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకకు యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరించారు.
అరవింద సమేత చిత్రంలో సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రెండు పాటలు రాశారు. ఈ పాటలు రిలీజై ఇప్పటికే ట్రెండింగ్‌గా మారాయి. ఈ వేడుకలో సిరివెన్నెల మాట్లాడుతుండగా అభిమానులు అడ్డుపడ్డారు. దాంతో ఎన్టీఆర్ మాటలు వినాలంటే.. మా మాటలు కూడా వినాల్సిందే అని అన్నారు. ఎన్టీఆర్ అభిమానులంటే కిర్రెక్కించే పాటలే కాదు.. హృదయంతో వినే పాటలను కూడా ఆదరిస్తారు అని అన్నారు.

నా చేత ఓ పాటను రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నిర్మాత, దర్శకుడు అలాంటి పాటను రాయించడానికి కూడా భయపడుతారు. కానీ త్రివిక్రమ్, చినబాబు పాటను రాయించారు. రుధిరం అనే పాటను పెంచల్ దాస్ రాసి స్వయంగా పాడారు. నేను రాసిన పాటలకు రాయలసీమ భాషను అద్ది.. నేను, రామజోగయ్యశాస్త్రి, పెంచలదాసు అందించాం అని అన్నారు.


Click it and Unblock the Notifications











