అజ్ఞాతవాసి ఫ్లాప్‌తో తివిక్రమ్ స్థాయి తగ్గదు.. అలాగైతే నాకు ఫ్లాప్‌లు.. కానీ టెన్షన్‌గా.. ఎన్టీఆర్

జై లవకుశ లాంటి భారీ హిట్ తర్వాత ఎన్టీఆర్.. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా రావడం ఇదే మొదటిసారి. దాంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్లు, ట్రైలర్లు సినిమాకు హైప్‌ను పెంచాయి. అక్టోబర్ 11 రిలీజ్‌కు సిద్దమైవుతున్న నేపథ్యంలో, ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ పలు విషయాలను వెల్లడించారు. వారేమన్నారంటే..

రిలీజ్‌కు ముందు టెన్షన్‌‌గానే

రిలీజ్‌కు ముందు టెన్షన్‌‌గానే

అరవింద సమేత చిత్రంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. అలాగే నాకు అత్యంత ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నాను. ఇలాంటి అనుబంధాల మధ్య సినిమా ప్రేక్షకుల మధ్యకు వెళ్తున్నదంటే టెన్షన్‌గానే ఉంటుంది. మా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఓ సక్సెస్‌ఫుల్ చిత్రంగా మారితే ఓ మంచి మెమొరీగా మారుతుందని అనుకొంటున్నాను.

నాకు వరుస ఫ్లాపులున్నాయి కదా

నాకు వరుస ఫ్లాపులున్నాయి కదా

నేను నటించిన చిత్రాలు వరుస విజయాలు సాధించినంత మాత్రాన ఓ ఫ్లాఫ్ డైరెక్టర్‌తో నటించకూడదనే రూల్ ఏమీ లేదు. ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఆయన ప్రతిభ తగ్గిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్ సర్వసాధారణం. అలా అంటే నేను నటించి చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయితే నాతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లు సినిమా తీయలేదా అని ఎన్టీఆర్ అన్నారు.

Recommended Video

Aravinda Sametha Movie Had A Change
ఫెయిలైనంత మాత్రాన కెపాసిటీ తగ్గుతుందా?

ఫెయిలైనంత మాత్రాన కెపాసిటీ తగ్గుతుందా?

త్రివిక్రమ్‌కు అజ్ఞాతవాసి లాంటి ఫ్లాప్ ఉండొచ్చు. ఒక చిత్రం ఫెయిలైనంత మాత్రాన ఆయన సత్తా, కెపాసిటీ తగ్గిపోతుందా? ఒక విఫల ప్రయత్నం ఆయన స్థాయిని తగ్గిస్తుందని అనుకొను. మంచి, చెడు సినిమాలు వచ్చిన ఆయన పడే కష్టం ఒకటే. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. అన్నీ సఫలం కావు. అంత మాత్రాన విఫలమయ్యామని బాధపడలేం కదా. మళ్లీ సక్సెస్ వచ్చేంత వరకు ప్రయత్నించాలి.

బలమైన కథ, పాయింట్‌తో

బలమైన కథ, పాయింట్‌తో

కొన్నిసార్లు టైటిల్ కథను చెప్పలేకపోవచ్చు. కానీ అరవింద సమేత టైటిల్ కచ్చితంగా కథను చెప్పుతుంది. ఏ సినిమా అయినా ప్రేక్షకుడిని కథలో లీనం చేయాలి. మగవాడికి మహిళ బలమైన ఆయుధం అనే పాయింట్‌ను, మహిళా సాధికారితను కథలో బలంగా చెప్పగలిగాం అని ఎన్టీఆర్ అన్నారు.

స్టార్ హీరో ఇమేజ్‌కు దూరంగా

స్టార్ హీరో ఇమేజ్‌కు దూరంగా

కథ ఏదైనా, కథనం ఎలా ఉన్నా, సబ్జెక్ట్ ఏదైనా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయాలి. స్టార్ హీరోతో చేసేటప్పుడు ఇమేజ్ బ్రేక్ చేయడానికి ప్రయత్నించాం. ఈ సినిమాలో హీరో ఇమేజ్‌కు దూరంగా కథను నిజాయితీగా చెప్పాలి. అందుకే అరవింద సమేత కచ్చితంగా ప్రేక్షకుడు చూడాలి. వారికి నచ్చుతుంది అని త్రివిక్రమ్ అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X