అరవింద సమేత ఆలస్యం.. ఛాన్స్ ఉందంటూ ఉహాగానాలు!
Recommended Video

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు షాక్ లో ఉన్నారు. నిన్ననే హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుమారులుగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ హిందూ పద్ధతి ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలు జరిపే సమయంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. వారు ఏ భాదనుంచి తేరుకోవాలనుంటే సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత చిత్రం విడుదల ఆలస్యం కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది.

ఇంకా కొన్ని రోజులు
అరవింద సమేత చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో బిజీగా జరుగుతోంది. కానీ మరికొన్ని రోజులవరకు ఎన్టీఆర్ షూటింగ్ కు హాజరయ్యే అవాకాశం లేదు. తండ్రి అకాల మరణంతో ఎన్టీఆర్ షాక్ లో ఉన్నాడు. కుటుంబ సభ్యులకు కూడా ఎన్టీఆర్ తోడు అవసరం.

షూటింగ్ ఆలస్యం
మరికొన్ని రోజుల పాటు ఇంట్లో జరగాల్సిన కార్యక్రమాలు కూడా ఎన్టీఆర్ చూసుకోవాలి. దీనితో అరవింద సమేత షూటింగ్ ఆలస్యం కానుంది. ముందుగా ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేశారు. పరిస్థితులు చూస్తుంటే విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఛాన్స్ ఉంది
అరవింద సమేత చిత్ర యూనిట్ ని వస్తున్న వార్తల ప్రకారం సినిమా అనుకున్న సమయానికే విడుదల అయ్యే ఛాన్స్ ఇంకా ఉందని అంటున్నారు. ఎందుకంటే.. త్రివిక్రమ్ ఇప్పటికే మేజర్ షూటింగ్ పూర్తి చేశారు. కొన్ని సన్నివేశాలు, నాలుగు సాంగ్స్ మాత్రమే మిగిలిఉన్నాయని అంటున్నారు.

తొలిసారి
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత విషయంలో పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పూజ హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











