‘అరవింద సమేత’ ట్రైలర్ టెర్రిఫిక్: ఫ్యాక్షన్ సినిమాలన్నింటినీ మించేలా...
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' మూవీ ఆడియో వేడుక హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పటి వరకు తెలుగులో ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ ఉన్న సినిమాలు చాలా వచ్చాయి. వాటన్నింటినీ మించిపోయేలా 'అరవింద సమేత' చిత్రం ఉంటుందని తాజాగా విడుదలైన ట్రైలర్ చేస్తే స్పష్టం అవుతోంది. కొట్టడం, నరకడం ఎవడైనా చేయగలడు.... అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు... అనే డైలాగ్స్ బట్టి సినిమాలో మంచి సందేశం ఉంటుందని స్పష్టమవుతోంది.

కత్తి చుట్టూ అరవింద సమేత కథ
‘‘30 ఏళ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంటే... అది అవసరం, అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం, అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపం అవుతుందా?'' అంటూ వీర రాఘవుడికి బామ్మ చెప్పే మాటలను బట్టి సినిమా రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యం, కత్తి చుట్టూ నడుస్తుందని స్పష్టమవుతోంది.

త్రివిక్రమ్ డైలాగ్స్ అదుర్స్
‘‘కొట్టడం, నరకడం ఎవడైనా చేయగలడు.... అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు. వాడే గొప్ప''... ‘‘వినే టైమ్.. చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది''... ‘‘వంద అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వేసి ఆపేసేవాడిని ఏమంటారు? ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం.. తవ్వి చూడండి'' లాంటి డైలాగులు తివిక్రమ్ మరోసారి తన మాటల మ్యాజిక్ చూపించాడని స్పష్టమవుతోంది.

బ్యూటిఫుల్ లవ్ స్టోరీ
ఈ చిత్రంలో ఒళ్లు గగుర్బొడిచే రాయలసీమ ఫ్యాక్షన్ డ్రామా మాత్రమే కాదు.... అరవిందకు, వీర రాఘవుడికి మధ్య జరిగే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతోందని అరవింద సమేత ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

జగపతి బాబు షాకింగ్ లుక్
ఇందులో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు జగపతిని పలు చిత్రాల్లో విలన్‌గా చూశాం. ఈ చిత్రంలో అతడిని చూపించే విధానం ఎంత భయంకరంగా ఉంటుందో ట్రైలర్లో అతడి లుక్ చూసి అర్థం చేసుకోవచ్చు.

కీలక పాత్రలో నాగబాబు
నందమూరి హీరో నటిస్తున్న ఈ చిత్రంలో మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు నటించడం మరో హైలెట్. ఇందులో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతోంది.
అరవింద సమేత ట్రైలర్
ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాయలసీమ కుర్రాడు వీర రాఘవ పాత్రలో కనిపించబోతున్నారు. అరవింద పాత్రలో పూజా హెగ్డే నటిస్తోంది. ప్రేమ కథ చుట్టూ జరిగే ఫ్యాక్షన్ సినిమాలా ఇది ఉంటుందని తెలుస్తోంది. 'అరవింద్ సమేత' చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబుతో పాటు నాగబాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











