‘అరవింద సమేత’ ట్విట్టర్ రివ్యూ: టాక్ ఎలా ఉందంటే...
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇండియా రిలీజ్ కంటే ముందే యూఎస్ఏలో ప్రీమియర్ షోలు పడటంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో తెల్లవారు ఝామునే బెనిఫిట్ షోలు పడ్డాయి. అన్ని చోట్ల నుండి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. పలువురు ఆడియన్స్‌తో పాటు అభిమానులు ట్విట్టర్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ ట్వీట్స్ చేశారు. ఈ చిత్రంపై టాక్ ఎలా ఉంది? ఎన్టీఆర్ పెర్పార్మెన్స్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించో వారి ట్వీట్లోనే చూద్దాం.
తారక్ కోసం చూడొచ్చు
దర్శుకుడు త్రివిక్రమ్ మొదటి సీన్ నుండి శాంతి సందేశం ఇవ్వడం మొదలు పెట్టాడు. ఈ పాయింటుకు ఎంత మంది కనెక్ట్ అవుతారో తెలియదు. కథలో కొత్తదనం కనిపించలేదు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగుల మీద మరింత శ్రద్ధ పెడితే బావుండేది. పెనివిటి సాంగ్ నిరాశ పరిచింది. సినిమాలో తారక్ ఎంట్రీ సీన్, జగపతి బాబు యాక్టింగ్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ హైలెట్. స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌండ్ స్కోర్, రోటీన్ కథ, స్లో నేరేషన్ మైనస్ పాయింట్స్. తారక్ కోసం చూడొచ్చు.
సూపర్ డూపర్ మాస్ హిట్
సూపర్ డూపర్ మాస్ హిట్. సెకండాఫ్ సూపర్. పర్ఫెక్ట్ రాయలసీమ ప్యాక్షన్ మూవీ. త్రివిక్రమ్ దర్శకత్వం, తారక్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది.
బ్లాక్ బస్టర్ బొమ్మ
అరవింద సమేత బ్లాక్ బస్టర్ బొమ్మ అంటూ కొందరు తారక్ ఫ్యాన్స్ సినిమాపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
త్రివిక్రమ్ కంబ్యాక్ మూవీలా ఉంది
రచయితగా త్రివిక్రమ్ కంబ్యాక్ మూవీలా ఉంది. తారక్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. హిట్ మూవీ.
త్రివిక్రమ్ కంప్లీట్ మాస్ మూవీ
మొదటి 20 నిమిషాలు టెర్రిఫిక్. కామెడీ తక్కువగా ఉంది. ఇంటర్వెల్ అద్భుతం. త్రివిక్రమ్ నుండి వచ్చిన మాస్ మూవీ ఇది.
సీడెడ్లో జాతరే
తారక్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు.సునీల్ కామెడీ బాగా వర్కౌట్ అయింది.జగపతి బాబు సూపర్. తమన్ మ్యూజిక్ బావుంది. ఇక సీడెడ్ ఏరియాలో జాతరే.
డీసెంట్ మూవీ
అరవింద సమేత డీసెంట్ మూవీ. కథ కొస్త పాతగా ఉన్నా త్రివిక్రమ్ డైలాగులు, తాకర్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.
ఎన్టీఆర్ మరోసారి ప్రూవ్ చేసాడు
.
మరో బ్లక్ బస్టర్
.
110 కోట్ల కలెక్షన్ పక్కా
.
ఒకసారి చూడదగ్గ సినిమా
ఒక్కసారి చూడదగిన సినిమా. ఎన్టీఆర్, జగపతి బాబు పెర్ఫార్మెన్స్ మేజర్ ప్లస్ పాయింట్స్. సినిమాలో వినోదం లేదు. స్లో నేరేషన్ మైనస్ పాయింట్.


Click it and Unblock the Notifications











