తారక్‌ నువ్వు మిస్సయ్యావ్‌ : హీరోయిన్ ఆసక్తికర ట్వీట్

By Bojja Kumar

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పూజా‌కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా సెట్స్ నుండి వెళుతూ ఆమె చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

'అరవింద సమేత' సినిమాకు సంబంధించిన షూటింగులో నా షెడ్యూల్‌ పూర్తైంది. రోజూ సెట్‌కి రావడం చాలా ఉత్సాహంగా అనిపించేది. తారక్‌..నువ్వు మిస్సయ్యావ్‌. మరోసారి కలిసి ఫొటో దిగుదాం' అని త్రివిక్రమ్‌తో దిగిన ఫోటోను పూజా అభిమానులకు షేర్ చేసింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ వీరరాఘవ పాత్రలో నటిస్తున్నాడు. అవింద అనే అమ్మాయి పాత్రలో పూజా హెగ్డే నటిస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ ఉన్న ప్రేమ కథా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Aravindha Sametha actress Pooja Hegde interesting tweet

ఇందులో ఎన్టీఆర్ న్యూలుక్ తో కనిపించబోతున్నారు. పాత్రకు తగిన విధంగా బరువు తగ్గడంతో పాటు కండలు పెంచాడు. సినిమాలో యాక్షన్ పార్ట్ మీద దర్శకుడు త్రివిక్రమ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈచిత్రం దసరా లేదా దీపావళి సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X