ఎన్టీఆర్‌కు మాత్రమే సాధ్యమైన రికార్డ్.. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఆరు సార్లు యంగ్ టైగర్ పంజా!
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం గురువారం ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ ప్రారంభం కావడంతో విజయపథంలో దూసుకుపోతోంది. ఈ చిత్రం సాధిస్తున్న వసూళ్లు చూస్తుంటే అరవింద సమేత భారీ విజయం దిశగా దూసుకుపోతున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్రివిక్రమ్ చిత్రాలు యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడతాయి. ఊహించిన విధంగానే అరవింద సమేత కూడా యూఎస్ లో డాలర్ల వర్షం కురిపిస్తోంది.

ప్రీమియర్లతోనే
యుఎస్ లో అరవింద సమేత దాదాపు 200స్క్రీన్స్ లో విడుదలయింది. కేవలం ప్రీమియర్స్ షోలతోనే 8 లక్షల డాలర్ల వసూళ్లు రాబట్టింది. రెగ్యులర్ షోలు ప్రారంభమైన కొద్దిసేపటికే 1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిపోయింది. దీనితో యూఎస్ లో డిస్ట్రిబ్యూటర్ కు భారీ లాభాలు ఖాయం అని అంచనా వేస్తున్నారు.

అరుదైన రికార్డు
అరవింద సమేత యూఎస్ లో ఒక మిలియన్ క్లబ్ లో చేరడంతో ఎన్టీఆర్ అరుదైన రికార్డు సాధించాడు. యూఎస్ లో ఒక మిలియన్ డాలర్ మార్క్ అందుకోవడం ఎన్టీఆర్ కు ఇది ఆరవసారి. దమ్ము, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ చిత్రాలు గతంలో ఈ రికార్డు సాధించాయి. తాజగా ఆ జాబితాలోకి అరవింద సమేత చేరింది.

దసరా సెలవులు
ఓవర్సీస్ లో ఎన్టీఆర్ స్టామినా, త్రివిక్రమ్ మ్యాజిక్ పనిచేస్తుంటే.. లోకల్ మార్కెట్ మరింత జోరుగా అరవింద సమేత వసూళ్లు కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవింద సమేత చిత్రం తొలి రోజు దాదాపు 26 కోట్ల షేర్ రాబట్టింది. దసరా సెలవులు కూడా కలసి రానుండడంతో అరవింద సమేతకు బాక్సాఫీస్ వద్ద తిరుగులేదని చెప్పొచ్చు.

ఫ్యాక్షన్ కథని కొత్తగా
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సారి పవర్ ఫుల్ ఫ్యాక్షన్ కథతో వచ్చాడు. ఫ్యాక్షన్ కథ అయినప్పటికీ త్రివిక్రమ్ తెరకెక్కించిన విధానం కొత్తగా ఉండడంతో ఆడియన్స్ కు కనెక్ట్ అయింది. ఈ చిత్రంలో అరవిందగా పూజ హెగ్డే నటించింది. జగపతి బాబు విలన్ పాత్రలో, నాగబాబు కీలక పాత్రలో నటించారు.


Click it and Unblock the Notifications











