అరవింద సమేతకు షాక్.. లీకైపోయిన ఫైట్ సీన్, ఇంత అజాగ్రత్తా!

Recommended Video

అరవింద సమేతకు షాక్.. లీకైపోయిన ఫైట్ సీన్, ఇంత అజాగ్రత్తా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తొలిసారి నటిస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే అరవింద సమేత షూటింగ్ పూర్తయింది. దసరాకు భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందించిన పాటలు విడుదలై అదరగొడుతున్నాయి. అరవింద సమేత చిత్ర షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చిత్ర యూనిట్ కు లీకుల బెడద తప్పడం లేదు. తాజాగా కీలకమైన ఫైట్ సన్నివేశాన్నే ఇంటర్నెట్ లోకి లీక్ చేసేశారు.

స్టిల్స్ లీక్ చేస్తూ

స్టిల్స్ లీక్ చేస్తూ

షూటింగ్ ఆరంభం అయినప్పటి నుంచి అరవింద సమేత స్టిల్స్ లీక్ అవుతున్నాయి.ఆరంభంలో ఎన్టీఆర్, నాగబాబు స్టిల్ లీకైన సందర్భంలో చిత్ర యూనిట్ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఆ తరువాత కూడా లీక్స్ ఆగకపోవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ జాగ్రత్త పడ్డట్లు వార్తలు వచ్చాయి.

ఎడిటింగ్ రూమ్ నుంచేనా

ఎడిటింగ్ రూమ్ నుంచేనా


చూస్తుంటే ఈ లీక్స్ అన్ని ఎడిటింగ్ రూమ్ నుంచే జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్, నాగబాబు ఉన్న సన్నివేశాలకు సంబందించిన స్టిల్స్ అదేపనిగా లీక్ అవుతుండడంతో త్రివిక్రమ్ చిత్ర యూనిట్ పట్ల ఫైర్ అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

 ఏకంగా ఫైట్ సన్నివేశమే

ఏకంగా ఫైట్ సన్నివేశమే


ఈసారి అరవింద సమేతకు లీకేజి రాయుళ్ల నుంచి గట్టి దెబ్బే తగిలినట్లు కనిపిస్తోంది. చిత్రానికే కీలకమైన ఫైట్ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఎన్టీఆర్, నాగబాబు కారులో ప్రయాణిస్తుండగా విలన్లు దాడి చేసే సన్నివేశంలా కనిపిస్తోంది.

 ఇంత అజాగ్రత్తా

ఇంత అజాగ్రత్తా

అరవింద సమేత చిత్రం భారీ స్టార్ కాస్టింగ్, కోట్లాది రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇంత భారీ చిత్రం విషయంలో అజాగ్రత్త ఏంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒకసారి అయితే పొరపాటు అని భావించవచ్చు కానీ వరుసగా స్టిల్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా సీనే లీక్ చేశారు.

అక్టోబర్ 11న

అక్టోబర్ 11న


అక్టోబర్ 11న దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కుస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఫాన్స్ ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X