అరవింద సమేత.. ఆ నలుగురు ఒకే చోట!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కలయికలో వస్తున్న తొలి చిత్రం ఇది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. ఎవరూ ఊహించని విధంగా సిక్స్ ప్యాక్ లుక్ లో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ ప్రజెంట్ చేశాడు. ఎన్టీఆర్ ఫాన్స్ అయితే సంతోషంలో మునిగిపోయారు.
అరవింద సమేత అనే టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంటూ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర విశేషాలని సంగీత దర్శకుడు తమన్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నాడు. అద్భుతమైన స్వరాలు అందించే పనిలో తమన్ బిజీగా ఉన్నాడు. తాజగా ఎన్టీఆర్ సహా తమన్, త్రివిక్రమ్, సిరివెన్నెల ఒకే చోట కూర్చుని ఉన్న ఫోటో వైరల్ అవుతుతోంది.

ఈ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఏ సంగీత దర్శకుడికైనా ఇది డ్రీమ్ టీం అంటూ కామెంట్ పెట్టాడు. అరవింద సమేత చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.


Click it and Unblock the Notifications











