twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడియో: నిన్న మాస్.. నేడు రొమాన్స్.. హీరోయిన్‌తో గోడపై ఎన్టీఆర్, మోషన్ పోస్టర్ వచ్చేసింది!

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సంబరాలు ఒకవైపు జరుగుతుంటే.. అరవింద సమేత వీర రాఘవ చిత్ర హంగామా సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అరవింద సమేత చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన తెలిసిపోతోంది. ఎవరూ ఊహించని విధంగా ఫస్ట్ లుక్ విడుదల చేసిన త్రివిక్రమ్ అభిమానులని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ సంతోషం నుంచి తేరుకోక ముందే చిత్ర యూనిట్ తాగాజా మోషన్ పోస్టర్ విడుదల చేసింది.

     రచ్చ చేస్తున్న ఫస్ట్ లుక్

    రచ్చ చేస్తున్న ఫస్ట్ లుక్

    ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ అభిమానులు పండగ చేసుకునేలా ఉంది. టైటిల్ కూడా అదిరిపోయిందంటూ సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తొలి సారి వస్తున్న చిత్రం ఇది.

    నిన్న మాస్, నేడు రొమాన్స్

    తాజగా చిత్ర యూనిట్ అరవింద సమేత వీర రాఘవ మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు. నిన్న ఊరమాస్ లుక్ తో అభిమానులని ఖుషి చేసిన ఎన్టీఆర్, నేడు పూజా హెగ్డేతో రొమాన్స్ చేస్తూ అలరిస్తున్నాడు. మోషన్ పోస్టర్ లో పూజా హెగ్డే, ఎన్టీఆర్ గోడపై కూర్చుని రొమాంటిక్ గా కనిపిస్తున్నారు.

    తమన్ సంగీతం

    తమన్ సంగీతం

    తమన్ ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో దూసుకుని పోతున్నాడు. ఆ నమ్మకంతోనే త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తమన్ ని ఎంపిక చేసుకున్నాడు. మోషన్ పోస్టర్ లో తమన్ అందించిన సంగీతం కూల్ గా ఉంది.

    పూజా హెగ్డేతో తొలిసారి

    పూజా హెగ్డేతో తొలిసారి

    ఎన్టీఆర్, పూజా హెగ్డే తొలిసారి కలసి నటిస్తున్న చిత్రం ఇది. డీజే చిత్రంలో తన అందాలతో కనువిందు చేసిన పూజా అందరి దృష్టిని ఆకర్షించి మంచి అవకాశాలని అందిపుచ్చుకుంటోంది.

    English summary
    Aravindha Sametha Motion Poster released. NTR and Pooja Hegde looks good
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X