twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అరవింద సమేత టీజర్: కంట బడ్డావా కనికరిస్తానేమో.. ఎంట బడ్డానా నరికేస్తానబ్బా, ఎన్టీఆర్‌ చంపేశాడు!

    |

    Recommended Video

    Aravindha Sametha Official Teaser

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. త్రివిక్రమ్ దర్శకతంలో తెరక్కుతున్న ఈ చిత్రంపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ తోనే త్రివిక్రమ్ అంచనాలు పెంచేశాడు. నేడు ఆగష్టు 15. ఈ రోజు కోసం ఎన్టీఆర్ ఫాన్స్ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తునాన్రు. అరవింద సమేత టీజర్ కోసమే ఆ ఎదురుచూపులు. ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకునే సమయం వచ్చేసింది. కొద్దీ సేపటి క్రితమే ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అరవింద సమేత పవర్ ఫుల్ టీజర్ విడుదల చేశాడు.

    అదిరిపోయింది

    అదిరిపోయింది

    టీజర్ 50 సెకండ్ల నిడివి ఉన్న టీజర్ పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ తో నిండిపోయింది. ఎన్టీఆర్ మునుపెన్నడూ చూడని యాంగ్రీ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

    జగపతి బాబు డైలాగ్స్

    జగపతి బాబు డైలాగ్స్

    త్రివిక్రమ్ మాటలమాంత్రికుడు అనే పేరుని మరు మారు నిరూపించుకున్నాడు. రాయలసీమ యాసలో జగపతిబాబు చెబుతున్న డైలాన్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా, మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా.. మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా అంటూ భీకరమైన డైలాగ్స్ చెబుతున్నాడు.

     ఎన్టీఆర్ స్టైల్

    ఎన్టీఆర్ స్టైల్

    త్రివిక్రమ్ పవర్ ఫుల్ డైలాగ్స్ ఎన్టీఆర్ పలికితే అదుర్స్ అనాల్సిందే. ఎన్టీఆర్ విలన్ కి వార్నింగ్ ఇస్తున్నాడు. కంట బడ్డావా కనికరిస్తానేమో.. ఎంట బడ్డానా నరికేస్తానబ్బా అంటూ ఎన్టీఆర్ డైలాగ్స్ వదులుతున్నాడు.

    భీకరమైన యాక్షన్

    రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుందని టీజర్ తో తేలిపోయింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో భీరమైన పోరాట సన్నివేశాలు ఉన్నాయి. సిక్స్ ప్యాక్ లుక్ లో చేతిలో ఆయుధం పట్టుకుని విలన్స్ ని ఎన్టీఆర్ చీల్చి చెండాడుతున్నాడు. టీజర్ తో అరవింద సమేత చిత్రంపై అంచనాలు రెట్టింపు కావడం ఖాయం.

    తమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం

    తమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం

    టీజర్ లో తమన్ బ్యాగ్రౌండ్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రోమాలునిక్కబొడుచుకునేలా ఎన్టీఆర్ డైలాగ్ చెబుతుంటే ఆ సన్నివేశాన్ని మరింత హైలైట్ చేసేలా తమన్ సంగీతం ఉంది.

    English summary
    Aravindha Sametha Official Teaser released. NTR delivers powerful dialogues
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X