ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్: ఆ ముగ్గురు కలసి.. కొడుకుని నెత్తిన ఎక్కించుకున్న తారక్, ఎమోషనల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు 35 వ పడిలోకి అడుగుపెట్టాడు. ఎన్టీఆర్ జన్మ దినం నేడు. ఈ పుటిన రోజు ఎన్టీఆర్ కు చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. కెరీర్ పరంగా కూడా ఎన్టీఆర్ మంచి జోష్ మీద ఉన్నాడు. అతడి నటించిన చిత్రాలు వరుస విజయాలు సాధిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఆదివారం రోజు ఫస్ట్ లుక్, టైటిల్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ విడుదలతో ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

వీర రాఘవ లుక్ అదిరిపోయింది
అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఎన్టీఆర్ చిత్రం కోసం త్రివిక్రమ్ అద్భుతమైన టైటిల్ సెట్ చేసారు. అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్ ఎన్టీఆర్ అభిమానులని విపరీతమైన సంతోషంలో ముంచెత్తుతోంది. ఇది ఒక ఎత్తైతే ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించడం మరో ఎత్తు. మొత్తగా ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు.

మొదలైన సంబరాలు
ఫస్ట్ లోక్ తో త్రివిక్రమ్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సంబరాలని రెట్టింపు చేసాడు. ఈ ఫస్ట్ లుక్ సోకల్ మీడియాని దున్నేస్తోంది. ఎన్టీఆర్ కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ చెబుతూ అభిమానులు హంగామా సృష్టిస్తున్నారు.

ఎన్టీఆర్‌ని ఆ ముగ్గురూ
ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత చినబాబు, సంగీత దర్శకుడు తమన్ ఎన్టీఆర్ ని కలసి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విషయాన్ని తమన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
కొడుకుని నెత్తిన ఎక్కించుకుని
ఎన్టీఆర్ తాజగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. అభయ్ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసేంతగా ఎదిగాడని కొడుకుని నెత్తిన ఎక్కించుకుని ఉన్న ఫోటోని షేర్ చేసాడు.


Click it and Unblock the Notifications











