సెక్స్ కామెడీ సినిమా అస్సలు చేయను
'నిర్మాతగా లేదా రచయితగా, దర్శకుడిగా మనం ఒక సినిమా చేస్తున్నాం అంటే.... ఆ సినిమాలో మన అభిరుచులు, భావనలు ఎలా ఉంటాయో రిఫ్లెక్ట్ అవుతాయి. ఒక డిస్ట్రిబ్యూటర్ సినిమాపై పెట్టుబడి పెట్టాలంటే అది మంచి సినిమా అయి ఉండాలని, ఎక్కువ మంది ఆదరించే సినిమా అయి ఉండాలని కోరుకుంటాడు' అని అర్బాజ్ వెల్లడించారు.
'అలా అని క్లీన్ సినిమాలు మాత్రమే మంచివి అని అనడం లేదు. సెక్స్ కామెడీ ఉన్న సినిమాలు గానీ, ఇతర శైలిలో రూపొందే చిత్రాలు కూడా ప్రేక్షకుల అభిరుచిని బట్టే రూపొందుతున్నాయి. ఇందులో తప్పేం లేదు. ఏ సినిమా అయినా వినోదం పంచేందుకే, అయితే నా అభిరుచికి తగినట్టుగా నేను సినిమాలు చేస్తాను' అని స్పష్టం చేసారు.
కాగా.... దబాంగ్ సినిమా తర్వాత అర్భాజ్ ఇంకా సినిమాలే ఏమీ మొదలు పెట్టలేదు. సల్మాన్ తో మరో సోదరుడు సొహైల్ ఖాన్ ఇప్పుడు 'మెంటల్' అనే సినిమాను రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. తెలుగులో చిరంజీవి నటించిన 'స్టాలిన్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది.


Click it and Unblock the Notifications












