నిర్మాతలపై నటి అర్చన షాకింగ్ కామెంట్స్.. వాళ్లకో రూల్, మాకో రూలా?
సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా నెగ్గురావడమనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలా చాలా మందిలాగే ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది నటి అర్చన అలియాస్ వేద. తాజాగా ఆమె తెలుగు నిర్మతాల విషయంలో చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.హీరోయిన్ అర్చన.. స్టార్ హీరోయిన్ కానప్పటికీ తెలుగు ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితమే. చాలా సినిమాల్లో నటించి అందంతో పాటు తనలో టాలెంట్ కూడా ఉందని అర్చన నిరూపించుకుంది. కానీ ఎందుకో ఆమెకు స్టార్ స్టేటస్ అయితే దక్కలేదు. తపన అనే సినిమా తో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ కు పరిచియం అయ్యింది అర్చ. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, సామాన్యుడు, శ్రీ రామరాజ్యం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందింది ఇక ఈ క్రమంలో ఆమె బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేసింది. అయినా అది వర్కౌట్ అయితే అవలేదనే చెప్పాలి.
సినిమాల్లో ఆమెకు ఛాన్సులు తగ్గడం, వచ్చినా.. సరైన అవకాశాలు రాకపోవడం వల్ల నెమ్మదిగా తెరకు దూరం అయ్యింది. అయితే తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ లాంటి భాషల్లో నటించినా కాని.. అక్కడ అక్కడ కూడా ఆమెకు మంచి అవకాశాలు దక్కలేదు. అందుకే ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ప్యామిలీ లైఫ్ లో బిజీ బిజీ అయిపోయిన అర్చన సినీ పరిశ్రమలో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అని భావించి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ సందర్భంగా ఇండస్ట్రీలో జరుగుతున్న మేల్ డామినేషన్ పై అర్చన తీవ్రంగా స్పందించింది. మిగతా అన్ని పరిశ్రమలో హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా సమానమైన గుర్తింపు ఉంటుందన్న ఆమె మన తెలుగు పరిశ్రమలో మాత్రం అదేమీ లేదని పేర్కొంది.

ఒక హీరోయిన్ పెళ్లయిన తర్వాత తిరిగి యాక్ట్ చేయడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి అని అర్చన పేర్కొన్నారు. పెళ్లయిన హీరోయిన్ లను మన నిర్మాతలు రెమ్యూనరేషన్ తగ్గించుకోమంటారని మరి అదే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న హీరోలకు ఆ మాట చెప్పగలరా...?అంటూ ఆమె ఘాటుగా ప్రశ్నించారు. అసలు ఇలా వివక్ష ఎందుకు చూపుతున్నారో తెలియడం లేదంటూ అర్చన అవేదన వ్యక్తం చేశారు. ఇక ఫ్యూచర్లో అయినా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి భేదాలు లేకుండా ఉండాలని అర్చన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











