twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీ నష్టాల్లో నాపేరు సూర్య.. సగానికిపైగా లాస్, ఆ ఇద్దరిలో తీవ్ర నిరాశ!

    |

    Recommended Video

    Naa Peru Surya Movie Dissapoints Allu Arjun Fans

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నటించిన చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. దేశభక్తి కథాంశంతో వచ్చిన ఈ చిత్రం మే 4 న విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయిందనే చెప్పాలి. తొలి షో నుంచే ఈ చిత్రానికి డివైడ్ టాక్ మొదలైంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో బోర్డర్ కు వెళ్లలనే కోరిక ఉన్న ఆర్మీ మాన్ గా నటించాడు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సినిమా తీవ్రంగా నిరాశ పరచడంతో బయ్యర్లకు భారీ స్థాయిలో నష్టాలు వాటిల్లినట్లు తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి.

    బన్నీ, అర్జున్ మధ్య

    బన్నీ, అర్జున్ మధ్య

    ఈ చిత్రంలో బన్నీ, అర్జున్ మధ్య సాగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. కానీ మిగిలిన కథనంలో బలం లేకపోవడంతో అల్లు అర్జున్ ఫాన్స్ సైతం నిరాశపడ్డారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అందరికి నిరాశనే మిగిల్చింది.

    నిరాశలో ఆ ఇద్దరూ

    నిరాశలో ఆ ఇద్దరూ

    ఈ చిత్రంలో తన లుక్ విషయంలో, యాక్షన్ సీన్స్ లో బన్నీ చాలా కష్టపడి చేశాడు. దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కించిన తొలి చిత్రం ఇది. నాపేరు సూర్య చిత్ర రిజల్ట్ వీరిద్దరిని తీవ్రంగా నిరాశపరిచినట్లు తెలుస్తోంది. బన్నీ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ కోసం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    అక్కడ సగానికి పైగా

    అక్కడ సగానికి పైగా

    ఈ చిత్రంతో బయ్యర్లకు అన్ని ప్రాంతాల్లో నష్టాలు వాటిల్లినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ సగానికిపైగా నష్టమే అని తేలింది. ఓవర్సీస్ హక్కులు 10 కోట్లవరకు అమ్ముడుపోగా ఈ చిత్రం కేవలం 4 కోట్ల వరకు మాత్రమే రికవరీ చేయగలిగింది.

    బన్నీ కెరీర్‌లోనే

    బన్నీ కెరీర్‌లోనే

    బన్నీ కెరీర్ రోల్ ఈ చిత్రం అతి పెద్ద డిజాస్టర్ అని ట్రేడ్ అనలిస్టులు తేల్చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య చిత్రాలతో ఆమె కెరీర్ డీలా పడింది.

    English summary
    Are Allu Arjun and Vakkantham Vamsi disappointed with Naa Peru Surya. Huge losses in US
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X