పంజా నిర్మాత నీలిమా తిరుమలశెట్టి ‘అరెరె’
ఈ సినిమా గురించి నిర్మాత మీడియాకు వెల్లడిస్తూ... 'అలియాస్ జానకి' తరువాత తమ సంస్థలో నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయిందని, సినిమాపై ఉన్న ప్యాషన్‌పై తారా అరుల్‌రాజ్, లక్ష్మీ చిక్కంతో కలిసి ఈ చిత్రాన్ని తాను నిర్మిస్తున్నానని, రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చుతుందని తెలిపారు.
సినిమా గురించి దర్శకుడు శశికిరణ్ మాట్లాతూ.... ఈ నెల 20వతేదీనుండి 35 రోజులపాటు రెండో షెడ్యూల్ జరుగుతుందని తెలిపారు. అదే విధంగా యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మూడో షెడ్యూల్ జరిపి సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేస్తామని, కెమెరా హైలెట్‌గా ఉంటుందని.
హీరో అభిజిత్ మాట్లాడుతూ...'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం తరువాత తనకు వచ్చిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటానన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా:సురేష్ భార్గవ్, నిర్మాతలు:నీలిమా తిరుమలశెట్టి, తారా అరుల్‌రాజ్, లక్ష్మీ చిక్కం, దర్శకత్వం:శశికిరణ్.


Click it and Unblock the Notifications












