ప్రైవేట్ పార్ట్ చిన్నది కావడంతో చెప్పుకోలేక సతమతమైన హీరో.. ఓ ఆటాడుకున్న అరియానా, అవినాష్

సినిమా ప్రమోషన్ అనేది ఈ రోజుల్లో ఎంత హై రేంజ్ లో ఉంటే అంత మంచిది. ప్రమోషన్ డోస్ వర్కౌట్ అయితేనే ఓపెనింగ్స్ బావుంటాయి. ఇక సినిమా కంటెంట్ కూడా ఆడియెన్స్ కు కనెక్ట్ అయితే కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి.. ఇక ఇటీవల ఒక యువ హీరో చేస్తున్న ప్రమోషన్ చాలా బోల్డ్ గా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

ఏక్ మినీ కథ

ఏక్ మినీ కథ

యూవీ క్రియేషన్స్ సపోర్టుతో 'ఏక్ మినీ కథ' అనే సినిమా రాబోతోంది. వర్షం దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ నటిస్తున్న ఈ సినిమా కథను మెర్లపాక గాంధీ రాశారు. ఇక కొత్త దర్శకుడు కార్తీక్ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా ఇటీవల విడుదలైంది.

యూవీ కొత్త ప్రొడక్షన్

యూవీ కొత్త ప్రొడక్షన్

యూవీ క్రియేషన్స్ ఇటీవల చిన్న సినిమాల కోసమని యూవీ కాన్సెప్ట్స్ పేరుతో ఒక కొత్త ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసింది. తక్కువ బడ్జెట్ లో కంటెంట్ బేసిడ్ సినిమాలను రూపొందించాలని డిసైడ్ అయ్యారు. అలాంటి ఆలోచనతో వచ్చిందే ఏక్ మినీ కథ. ఈ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు పెద్దగానే ఉన్నాయి.

అది చిన్నదైతే

అది చిన్నదైతే

ఇక ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ కంటెంట్ కు తగ్గట్లుగాన్స్ ప్రమోషన్ చేస్తోంది. పురుషాంగం చిన్నదిగా ఉండడంతో బాధపడే ఒక యువకుడు ఏ విధంగా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ ఫన్నీగా ప్రజెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఎమోషనల్ లవ్ ట్రాక్స్ కూడా ఉంటాయట.

 అరియానకు తెలియకపోవడంతో

అరియానకు తెలియకపోవడంతో

అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో హీరోయిన్ లతో ఇటీవల అరియానా, అవినాష్ లు ఇంటర్వ్యూ చేశారు. అయితే ఇంటర్వ్యూలో కథ మెయిన్ స్టోరీ తెలియకపోవడంతో అరియానాకు హీరో వివరించే ప్రయత్నం చేస్తూ ఇబ్బంది పడ్డారు. ఇక అవినాష్ కూడా చెప్పి చెప్పనట్లు చెబుతూ బాగానే నవ్వించాడు.

 బోల్డ్ గా ప్రమోట్ చేసేస్తున్నారు

బోల్డ్ గా ప్రమోట్ చేసేస్తున్నారు

అది చిన్నగా ఉంటుందని ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి చాలా సమయం తీసుకున్నారు. ఏదేమైనా ఈ హీరో బోల్డ్ కంటెంట్ ను చాలా బోల్డ్ గా ప్రమోట్ చేస్తున్నారు. సినిమా అయితే మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫిష్ టార్గెట్ ను అందుకోవడం కాయమని టాక్ వస్తోంది. మరి సినిమా ఎలాంటి టాక్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X