RGV పై ఆరియానా సంచలన ఆరోపణలు: వర్కౌట్ నెపంతో ఆ పార్టులు తాకి.. వర్మ రియాక్షన్ చూస్తే షాకే!
ఆరియానా గ్లోరీ.. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతోన్న పేరు ఇది. అంతలా ఈ బ్యూటీ తెగ హల్‌చల్ చేసేస్తోంది. మరీ ముఖ్యంగా బోల్డుగా ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఎనలేని క్రేజ్‌తో పాటు వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో ఆమె ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఇద్దరూ జిమ్‌లో పచ్చి పచ్చి మాటలతో రెచ్చిపోయారు. ఇక, ఈ వర్కౌట్ సమయంలో ఆర్జీవీ తనను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేశాడని ఆరియానా ఆరోపిస్తోంది. ఆ సంగతులు మీకోసం!

ఇద్దరూ అక్కడ పరిచయం అయ్యారు
యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించింది ఆరియానా గ్లోరీ. ఈ క్రమంలోనే దర్శకుడు రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసింది. అందులో 'ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన అమ్మాయి ఎవరు సార్' అని ఆయనను అడిగింది. దీనికి 'నువ్వే' అంటూ టక్కున బదులిచ్చాడు. అంతేకాదు, ఆ తర్వాత ఆమె గురించి ట్వీట్ చేయడంతో ఆరియానా ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది.

ఆరియానా గెలుపు కోసం వర్మ ట్వీట్
రాంగోపాల్ ఇంటర్వ్యూ పుణ్యమా అని ఆరియానా పేరు సెన్సేషన్ అయింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ రియాలిటీ షోలో ఛాన్స్ వచ్చింది. అందులో కంటెస్టెంట్‌గా ఆడుతోన్న సమయంలోనే మరోసారి ఆర్జీవీ ఆమెకు మద్దతుగా ట్వీట్ చేశాడు. అక్కడున్న వారిలో బిగ్ బాస్ అయ్యే సత్తా ఆమెకే ఉందని అందులో పేర్కొన్నాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య బంధం మరింతగా బలపడిందనే చెప్పాలి.

వర్మతో జిమ్‌లో బోల్డ్ పాప రచ్చ రచ్చ
కొద్ది రోజుల క్రితం వర్మ తన ట్విట్టర్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. అందులో ఓ అమ్మాయి బ్యాక్‌ను, నడుమును, ఎద భాగాన్ని ఫోకస్ చేస్తూ తీసిన ఫొటోలను వదిలి.. అందులో ఉన్నది ఎవరో కనిపెట్టమన్నాడు. దీనికి చాలా మంది ఆరియానా గ్లోరీ అంటూ బదులిచ్చారు. నిజంగానే అందులో ఉన్నది ఆమె కాబట్టి.. ఆ తర్వాత వర్మ కూడా ఆ పేరును రివీల్ చేస్తూ మరో ట్వీట్ చేశాడు.

ఆరియానా వర్మ.. ఓ బోల్డ్ ఇంటర్వ్యూ
అటు రాంగోపాల్ వర్మ.. ఇటు ఆరియానా గ్లోరీ ఇద్దరూ బోల్డుగా ఉండే వ్యక్తులే. అలాంటి ఈ ఇద్దరి మధ్య బౌండరీలే లేని ఇంటర్వ్యూ జరిగితే ఎలా ఉంటుంది. ఊహించడానికే ఏదోలా అనిపిస్తుంది కదా. అవును.. రెండు రోజుల క్రితం వీళ్లిద్దరూ కలిసి చిట్ చాట్ చేసిన వీడియోను యూట్యూబ్‌లో వదిలారు. అందులో పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో బోల్డు విషయాలపై మాట్లాడారు.

వీడియోకు భారీ స్పందన.. ట్రెండింగ్‌గా
రాంగోపాల్ వర్మతో ఆరియానా గ్లోరీ చేసిన ఇంటర్వ్యూను గత శనివారం యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కువగా సెక్స్ గురించిన సంభాషణలే జరిగాయి. ఇద్దరూ పోటాపోటీగా పచ్చిగా మాట్లాడుతూ దీన్ని రక్తి కట్టించారు. దీంతో ఈ వీడియోకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ వీడియోకు దాదాపుగా 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో ఇది సెన్సేషన్ అయింది.

వర్కౌట్ నెపంతో ఆ పార్టులు తాకాడు
ఈ ఇంటర్వ్యూ సమయంలో ఆరియానా గ్లోరీ మాట్లాడుతూ.. 'ఆర్జీవీ సార్.. మీరు ఏమీ అనుకోకు అంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా' అని అతడి పర్మీషన్ తీసుకుంది. ఆ తర్వాత 'మీరు వర్కౌట్ చేస్తున్నట్లు నెపంతో నా బాడీలోని అన్ని పార్టులను ఎలా పడితే అలా తాకుతున్నారు. ఇది నిజమా కాదా? మీరు చెప్పండి సార్' అని ఆయనపై సంచలన ఆరోపణలు చేసేసింది ఆరియానా గ్లోరీ.

వర్మ రియాక్షన్ చూస్తే షాక్ అవుతారు
ఆరియానా గ్లోరీ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ 'నువ్వు చెప్పింది వందకు వంద శాతం నిజం. అమ్మాయిలను టచ్ చేయడానికి వాళ్లతో వర్కౌట్లో, డ్రెస్ చూస్తాననో, మరేదో కారణం చెప్పి టచ్ చేస్తుంటా. ఎందుకంటే అమ్మాయిలంటే నాకు ఇష్టం. వాళ్ల కోసమే ఇలాంటి పనులు చేస్తుంటా' అంటూ వర్మ షాకింగ్ రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ వీడియో క్లిప్ విపరీతంగా వైరల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











