నాగార్జునతో అరియానా అలా.. మరో మంచి రోజంటూ హల్చల్
ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇన్ని రోజులు వైల్డ్ డాగ్ సినిమాపై ఓ మాదిరి అంచనాలే ఉండేవి. కానీ ఈ మధ్య చిరంజీవి విడుదల చేసిన ట్రైలర్‌తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. వైల్డ్ డాగ్ ట్రైలర్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు నాగ్. ఇప్పటికీ సోషల్ మీడియాలో వైల్డ్ డాగ్ దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం నాగ్ మాత్రం వైల్డ్ డాగ్ కోసం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే పనిలో ఉన్నాడు.

యూట్యూబ్‌లో వైరల్..
నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా హైద్రాబాద్ బాంబ్ పేలుళ్ల నేపథ్యంలో యదార్థ ఘటనలతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. వైల్డ్ డాగ్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా ఓ రేంజ్‌లో ఉండటంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే 9 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసేసింది.

నాగ్ అలా బిజీ..
అయితే తాజాగా నాగార్జున తన మూవీ యూనిట్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూను బిగ్ బాస్ ఫేమ్ అరియానా చేయడం విశేషం. ఒకప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఉన్న అరియానా ఇప్పుడు నాగార్జునను ప్రశ్నలు అడిగే రేంజ్‌కు వెళ్లింది.

బిగ్ బాస్ నాటి రోజులు..
బిగ్ బాస్ షో నాల్గో సీజన్‌లో అరియానా ఎంత సందడి చేసిందో అందరికీ తెలిసిందే. అరియానాను నాగార్జున కూడా ఎంతగా ఆట పట్టించాడో అందరూ చూశారు. అరియానా అవినాష్ అరియానా సోహెల్ అంటూ నాగార్జున ఎప్పుడూ ఏదో ఒక ట్రాక్ కలుపుతూ ఉండేవాడు.

మొత్తానికి ఇప్పుడు ఇలా..
బిగ్ బాస్ ఇంట్లో అలా ఉన్న అరియానా ఇప్పుడు నాగార్జునను వైల్డ్ డాగ్ కోసం స్పెషల్‌గా ఇంటర్వ్యూ చేసింది. నాగ్‌తో పాటు వైల్డ్ డాగ్ టీం కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే త్వరలోనే బయటకు రానున్న ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి.

మంచి రోజు..
ఇంటర్వ్యూ అనంతరం నాగార్జునతో అరియానా ఓ ఫోటోను దిగింది. ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. మళ్లీ మంచి రోజు వచ్చింది.. నాకెంతో ఇష్టమైన నాగ్ సర్‌ను కలిశాను. వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2న విడుదల కాబోతోందని చెప్పుకొచ్చింది. మొత్తానికి అరియానా రేంజ్ మారిపోయిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











