అర్జున్, జెడి.చక్రవర్తి ల 'కాంట్రాక్ట్' డిటేల్స్
యాక్షన్ కింగ్ అర్జున్, జెడి చక్రవర్తి కాంబినేషన్‌లో త్వరలో 'కాంట్రాక్ట్' టైటిల్ తో ఓ చిత్రం రూపొందనుంది. వర్మ కార్పొరేషన్‌లో జెడి చక్రవర్తి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఎస్.ఎస్.సమీర్ నిర్మాతగా మారి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి సమీర్ మాట్లాడుతూ-యాక్షన్ బేసెడ్ ప్రేమకథ ఇది. దేశ విదేశాల్లో విభిన్న ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ చేస్తాం. సెప్టెంబరులో చిత్రీకరణ మొదలవుతుంది. ఈ చిత్రంలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు చేయబోతున్నారు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జానీలాల్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు...అని చెప్పారు. సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: రామచంద్రరాజు. ఇక ప్రస్తుతం జెడీ చక్రవర్తి...మనీ చిత్రానికి మరో సీక్వెల్ మనీ మనీ..మోర్ మనీ అనే చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. నితిన్ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











