రామ్ తో మరో స్టార్ హీరో

By Staff

Arjun
లక్ష్యం శ్రీవాసు దర్శకత్వంలో రామ్ హీరోగా దిల్ రాజు నిర్మించనున్న చిత్రంలో అర్జున్ మరో ప్రత్యేక పాత్రను పోషించటానికి కమిట్ అయ్యారని సమాచారం. ఈ చిత్రానికి రామ కృష్ణ అనే టైటిల్ పెట్టారు. మొదట ఈ పాత్రకు నాగార్జున ని అడిగారని అయితే ఆయన ఒప్పుకోకపోవటంతో ఆ పాత్ర అర్జున్ వద్దకు వచ్చినంది. జూలై నుంచి సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక అర్జున్ గతంలో నితిన్ సినిమాలో సైతం ఓ కీలకమైన పాత్రను చేసారు. ఆలాగే ఈ చిత్రం పూర్తి స్దాయి ఏక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది.

ఇక ఈ టైటిల్ కి హరే రామ హరే కృష్ణ టైటిల్ ఇన్పిరేషన్ అని చెప్తున్నారు. మొదట ఆ టైటిలే పెడదామనుకున్నా ఎమ్.ఎస్.రాజు ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసారని అందుకే ఇలా పెడుతున్నారని అంటున్నారు. ఆ టైటిల్ తో అప్పుడు మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఎమ్.ఎస్.రాజు చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేసారు. అయితే పరిస్ధితులు అనుకూలించక వదిలివేయటం జరిగింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ఎంపిక కొనసాగుతోంది. మరో ప్రక్క లక్ష్యం సినిమాను శ్రీవాసు..బాలీవుడ్ సూపర్ హిట్ ఘాయల్ ని ప్రీమేక్ చేయటంతో ఈ సారి ఏ చిత్రం తెలుగు తెరపై దూకనుందోనని అంతా అంటున్నారు. ఏది తెచ్చినా హిట్ చేస్తాడు కాబట్టి ఇబ్బందేం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X