twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ సినిమానుంచి అర్జున్ అవుట్

    By Srikanya
    |

    ముంబై: రామ్ చరణ్ తాజా చిత్రం జంజీర్ రీమేక్ నుంచి అర్జున్ రాంపాల్ వైదొలుగుతున్నారు. ఈ చిత్రంలో షేర్ ఖాన్ పాత్రకు గానూ అర్జున్ రాంపాల్ ని తీసుకున్నారు. అయితే షూటింగ్ ఆలస్యం కావటంతో అర్జున్ రాంపాలు డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేని స్ధితి ఏర్పడింజది. ఈ విషయాన్ని దర్శకుడు అపూర్వ లఖియా ఖరారు చేసి మీడియాకు తెలియచేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...దురదృష్టవసాత్తూ అర్జున్ డేట్స్ దొరకలేదు. కాబట్టి ఆయన ఈ ప్రాజెక్టు నుంచి వైదొలక తప్పలేదు అన్నారు.

    ఇక అర్జున్ రాంపాల్ ప్లేసులోకి సంజయ్ దత్ ను తీసుకుంటారా అని అడిగితే..అలాంటిదేమీ లేదు..ఇప్పటివరకూ ఎవరని ఆ పాత్రకు సంప్రదించలేదు...త్వరలోనే ఎంపిక చేసి తెలియచేస్తాం అన్నారు. దానికి తోడు రామ్ చరణ్ కి ఎదురుగా యంగ్ నటుడు అయితే బాగుంటుందనే వాదన కూడా వినిపించటంతో సోనూ సోద్ ఆప్షన్ గా తీసుకున్నారు. సోనూ సూద్ అయితే తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుందనే వాదన ఉంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై జంజీర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది.

    1973లో అమితాబ్‌ బచ్చన్‌ నటించిన 'జంజీర్‌'కి ఈ చిత్రం రీమేక్. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ మెహ్రా నిర్మాత. నాటి చిత్రంలో జయ బాధురి పోషించిన పాత్రకు ప్రియాంక చోప్రాను ఎంపిక చేసుకొన్నట్లు హిందీ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే దర్శకుడు ప్రియాంకతో చర్చించారు. ఆమె అంగీకారం తెలిపారు. అయితే అందుకు ఆమెకు ఆరు కోట్లు వరకూ రెమ్యునేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమ సినిమాలో ఉంటే ఓపినింగ్స్ కు లోటు ఉండవని భావించి ఆమెను ఓకే చేసారు.

    రామ్ చరణ్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..నేను చాలా స్క్రిప్టులు బాలీవుడ్ ఎంట్రీ కోసం విన్నాను. వాటిలో ఏదీ నన్ను ఎక్సైట్ చేయలేకపోయింది. నేను లవర్ బోయ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ అవ్వదలుచుకోలేదు. జంజీర్ చిత్రం నాలో ఉన్న ట్యాలెంట్ ని వెలికి తీస్తుందనిపిస్తోంది. నన్ను కొత్తగా ప్రెజెంట్ చేస్తుందని నమ్మకం ఉంది అని అన్నారు. రామ్ చరణ్ బాలీవుడ్ కి కొత్త వాడు కావటంతో అన్ని రకాలుగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

    English summary
    Actor Arjun Rampal, who was all set to play the iconic role of Sher Khan in the remake version of Zanjeer, is no more part of the film, primarily due to date issues. All eyes were set on the remake version of the 1973 hit film Zanjeer and Arjun was quite excited to play the role, but apparently due to date issues he has walked out of the film. "Unfortunately we had date problems with Arjun...so we parted ways," director Apoorva Lakhia said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X