నేనూ హీరోనే, అల్లు అర్జున్‌కి విలన్ కావడం ఇష్టంలేదు!
హైదరాబాద్: ‘హీరోగా నా కెరీర్ ఇంకా ముగియలేదు. హీరోగా పాత్రలు చేస్తూనే దర్శకత్వంతో కూడా బిజీగా వున్నాను. ఇలాంటి సమయంలో విలన్ పాత్రలు చేసే ఆలోచన నాకు లేదు. ప్రేక్షకులు నన్నింకా కథానాయకుడుగా యాక్సప్ట్ చేస్తున్నారు. అటువంటప్పుడు రూటు మార్చుకుని విలన్ చేయాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం' అంటున్నాడు తమిళ నటుడు అర్జున్ సార్జా.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో విలన్ పాత్ర కోసం తమిళ నటుడు అర్జున్‌ను సంప్రదించగా పై విధంగా స్పందించారట. దీంతో అర్జున్ స్థానంలో కన్నడ నటుడు ఉపేందను తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. చాలా కాలం నుంచి రేపు మాపు అంటూ వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కావటంతో అభిమానుల ఆనందానికి అంతేలేదు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో శుభాకాంక్షలు చెప్తున్నారు.
ఇందులో బన్నీ సరసన సమంతతో పాటు ప్రణీత, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తారని సమాచారం. స్నేహ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తారు.


Click it and Unblock the Notifications











