కోటి రూపాయల ఆర్థిక సహాయం.. 30 వేల మందికి అండగా.. అర్జున్ కపూర్ మానవత్వంతో...

బాలీవుడ్‌లో రొమాంటిక్ లైఫ్, వివాహేతర సంబంధాలతో పాపులర్ అయిన అర్జున్ కపూర్ తనలో మానవత్వాన్ని బయటపెట్టారు. కరోనావైరస్‌తో దేశవ్యాప్తంగా బాధపడుతున్న బాధితులకు అండగా నిలిచేందుకు సిద్దమయ్యారు. సామాజిక బాధ్యతను భుజానికెత్తుకొన్న అర్జున్ కపూర్.. ప్రజాసేవల పాలుపంచుకొంటున్నారు. కోవిడ్‌తో అతలాకుతలమైన బతుకులకు అండగా నిలుస్తున్నారు. అర్జున్ కపూర్ తన సోదరి అన్షులా కపూర్‌తో చేపడుతున్న కార్యక్రమాల వివరాల్లోకి వెళితే..

ఫ్యాన్‌కైండ్ సంస్థతో

ఫ్యాన్‌కైండ్ సంస్థతో

కరోనావైరస్ మహమ్మారి కాలంలో అద్భుతమైన కార్యక్రమానికి అండగా నిలిచారు. ఆన్‌లైన్‌ ద్వారా సెలబ్రిటీలు నిధులను సేకరించే సంస్థ ఫ్యాన్‌కైండ్‌తో భాగస్వామ్యమయ్యారు. దేశవ్యాప్తంగా సేవ చేస్తున్న ఈ సంస్థ ద్వారా అర్జున్, అన్షులా కపూర్ 1 కోటి రూపాయలు నిధిని సాధించారు. ఈ సంస్థ ద్వారా 30 వేల కుటుంబాలకు సహాయం అందిస్తున్నారు.

హన్సిక మోత్వానీ.. అసలైన హాట్ మిల్కీ బ్యూటీ

కరోనా బాధితులకు అండగా

కరోనా బాధితులకు అండగా

కరోనావైరస్ కాలంలో కష్టపడుతున్న వారిని చూసి బాధ కలిగింది. బాధితులకు మేలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ముందుకొచ్చాం. ఫ్యాన్‌కైండ్ సంస్థకు సహాయం అందించాలని నిర్ణయం తీసుకొన్నాం. దేశవ్యాప్తంగా ఈ సంస్థ 30 వేల మందికి సహాయం అందిస్తుందనే విషయాన్ని తెలుసుకొని సంతోషం కలిగింది. దాదాపు 1 కోటి రూపాయాలు సేకరించాం అని అర్జున్ కపూర్ పేర్కొన్నారు.

ఉచితంగా భోజనం, రేషన్

ఉచితంగా భోజనం, రేషన్


ఫ్యాన్‌కైండ్‌ ద్వారా పుష్టికరమైన భోజనం, రేషన్ సంచులు అందిస్తున్నాం. వలస కార్మికులకు అవసరమైన నగదు అందిస్తున్నాం. కోవిడ్ బారిన పడకుండా వైద్య సదుపాయలు సమకూరుస్తున్నాం. పేద ప్రజలపై కరోనా ప్రభావం పడకుండా సరైన చర్యలు తీసుకొంటున్నాం అని అర్జున్ కపూర్ తెలిపారు.

నా లైఫ్‌టైమ్ సేవింగ్స్‌తో

నా లైఫ్‌టైమ్ సేవింగ్స్‌తో

కరోనా సంక్షోభ సమయంలో ఫ్యాన్‌కైండ్‌ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం కోసం నా జీవితంలో పొదుపు చేసిన మొత్తాన్ని అందించాను. ఈ సేవలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి విపత్కర సమయంలో ఈ సంస్థ ద్వారా సేవ చేయడానికి అవకాశం కలిగింది. అందుకు గర్వంగా ఫీలవుతున్నాను అర్జున్ కపూర్ అన్నారు.

Recommended Video

#RIPKVAnand: Allu Arjun ఎమోషనల్‌.. ప్రముఖుల సంతాపం KV Anand చిత్రాలు పెద్ద హిట్ || Filmibeat Telugu
అర్జున్ వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా

అర్జున్ వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా

అర్జున్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయానికి వస్తే.. మలైకా అఫైర్‌తో డేటింగ్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇక కెరీర్ పరంగా మంచి చిత్రాల్లో నటిస్తున్నారు. సర్దార్ కా గ్రాండ్‌సన్, భూత్ పోలీస్, ఏక్ విలన్ రిటర్న్స్ చిత్రాల్లో నటిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు పానిపట్, సందీప్ ఔర్ పింకీ ఫరార్ అనే చిత్రాల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X