ఇరుక్కుపోయిన పరిణితీ చోప్రా, అర్జున్ కపూర్..: ఆమె కోసం ఆ పని కూడా చేశాడు..

లగ్జరీని దాటి ఎప్పుడూ కామన్ మ్యాన్ లైఫ్‌ని దగ్గరగా చూడని సెలబ్రిటీలకు.. అసలు జీవితమంటే ఏంటో తెలిసే అవకాశమే లేదు. అందుకే.. సినిమాల్లో అలాంటి పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు మారు వేషాల్లో వెళ్లి వాళ్ల లైఫ్ స్టైల్‌ను గమనించడమో.. లేక ఆ సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలు చదవడమో చేస్తుంటారు.

Recommended Video

హరితేజకు అల్లు అర్జున్ వార్నింగ్ !

అలా.. అప్పటిదాకా ఎప్పుడూ చేయని పనులు కూడా సినిమా కోసం చేసేందుకు సిద్దమైపోతారు. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కూడా ఇప్పుడిదే పనిచేస్తున్నారు. ఇంతకీ ఆయనేం చేశారంటే..

 ఆమె కోసం.. అర్జున్ 'చపాతీ'..:

ఆమె కోసం.. అర్జున్ 'చపాతీ'..:

హీరోయిన్ పరిణితీ చోప్రా కోసం హీరో అర్జున్ కపూర్ చపాతీలు చేసి పెట్టాడు. అయితే ఇదంతా నిజ జీవితంలో కాదండోయ్. సినిమా షూటింగ్ లో భాగంగానే. అయితే వట్టి చపాతీలే తినేయలేం కదా.. అందుకే పరిణితీ కోసం దాల్, సబ్జీ కూడా ప్రిపేర్ చేశాడు.

 లొట్టలేసుకు తిన్న పరిణితీ:

లొట్టలేసుకు తిన్న పరిణితీ:

అర్జున్ కపూర్ చేసిన చపాతీలను, దాల్ తో లొట్టలేసుకు తింది పరిణితీ చోప్రా. అప్పటికే ఆకలితో విలవిల్లాపోతుండటంతో.. రుచికరమైన చపాతీలను కడుపు నిండా ఆరగించేసింది. అంతేకాదు, నీలో ఇంత టాలెంట్ ఉందా.. అంటూ అర్జున్ ను పొగిడేసింది.

 ఇంట్లో ఇరుక్కుపోయారు..:

ఇంట్లో ఇరుక్కుపోయారు..:

ఇంతకీ అర్జున్ చపాతీలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. సినిమాలో భాగంగా వీరిద్దరు ఓ ఇంట్లో అనూహ్యంగా ఇరుక్కుపోతారు. అక్కడినుంచి బయటపడటమెలాగో తెలియదు. ఈలోగా పరిణితీకి ఆకలికి దంచేస్తోంది. దీంతో మన హీరో గారు తనలోని టాలెంట్ బయటపెట్టి ఆమె కోసం వంట చేస్తారన్నమాట.

'సందీప్ ఔర్ పంకీ ఫరార్' :

'సందీప్ ఔర్ పంకీ ఫరార్' :

'సందీప్ ఔర్ పంకీ ఫరార్' అనే సినిమాలో ప్రస్తుతం అర్జున్, పరిణితీ హీరో-హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసమే అర్జున్ చపాతీలు చేసే సన్నివేశాన్ని ఇటీవల తెరకెక్కించారు. గతంలో 'కీ అండ్‌ కా'లో హౌజ్ హజ్బెండ్ పాత్రలో వంటలు చేసిన అనుభవంతోనో ఏమో.. అర్జున్ ఈ సినిమాలో చకచకా చపాతీలు చేసేశాడట.

 ఐదేళ్ల తర్వాత:

ఐదేళ్ల తర్వాత:

అర్జున్ కపూర్, పరిణితీ చోప్రా ఐదేళ్ల క్రితం 'ఇషాక్ జాదే' అనే సినిమాలో కలిసి నటించారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మళ్లీ 'సందీప్ ఔర్ పింకీ ఫరార్' చిత్రంలో నటిస్తున్నారు. సినిమాలో అర్జున్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ లో పలు విభిన్న కథాంశాలతో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న దిబకర్ బెనర్జీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X