నితిన్ ‘ఇష్క్’ 100, రీమేక్‌పై కన్నేసిన కపూర్
నితిన్, నిత్యా మీనన్ జంటగా నటించిన 'ఇష్క్' చిత్రంపై బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కన్నేశాడు. హీరోయిన్ శ్రీదేవి భర్త బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడైన అర్జున్ కపూర్ ఇటీవల 'ఇష్క్ జాదే'చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. 'ఇష్క్' చిత్రం తెలుగులో మంచి విజయం సాధించడంతో ఆ చిత్రం రీమేక్‌లో చేయాలని భావిస్తున్నాడు.
గతంలో ఈ చిత్రాన్ని రణబీర్ కపూర్ చేస్తాడని వార్తలు వచ్చినప్పటికీ అర్జున్ కపూర్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈచిత్రం రీమేక్ హక్కులను నిర్మాత బోనీ కపూర్ ఇప్పటికే కొనుగోలు చేసి నిర్మాణం మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
కాగా...ఇష్క్ చిత్రం జూన్ 2వ తేదీతో వంద రోజులు పూర్తి చేసుకుంటోంది. 11 సెంటర్లలో శత దినోత్సవాన్ని పూర్తి చేసుకున్న ఈచిత్రం నితిన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్ గౌడ్ నిర్మించిన ఈ సినిమా 2012లో దిబెస్ట్ మూవీగా అందరి ఆదరణను అందుకుంటుంది. దాదాపు 8 ఏళ్ల అనంతరం నితిన్ కు ఇష్క్ తో సూపర్ హిట్ లభించిన విషయం తెలిసిందే.
ఈ సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ మరిన్ని మంచి చిత్రాలను చేస్తానని నితిన్ ప్రకటించారు. నిర్మాత మాట్లాడుతూ...మా బేనర్లో తొలి చిత్రం సూపర్ హిట్ గా నిలవడం ఆనందంగా ఉంది. 'ఇష్క్'ను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. త్వరలో మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నామన్నారు.


Click it and Unblock the Notifications











